Director Gunasekhar Speaks about Rudramadevi Movie Release Date | Anushka Shetty

Director gunasekhar speaks about rudramadevi movie release date

rudramadevi, gunasekhar, gunasekhar latest news, director gunasekhar, gunasekhar updates, rudramadevi news, rudramadevi release date, rudramadevi vfx works, rudramadevi movie gossips, rudramadevi movie news, rudramadevi movie, rudramadevi

Director Gunasekhar Speaks about Rudramadevi Movie Release Date : Director Gunasekhar says that due to vfx workds Rudramadevi movie release date postponed. Soon they will announce official date.

‘రుద్రమదేవీ’ విడుదల తేదీపై గుణశేఖర్ క్లారిటీ

Posted: 07/06/2015 12:06 PM IST
Director gunasekhar speaks about rudramadevi movie release date

‘ఒక్కడు’ సినిమాతో తన దర్శకత్వం ట్యాలెంట్ ఏంటో దర్శకుడు గుణశేఖర్ నిరూపించేసుకున్నాడు. ఆ సినిమా ఇతనికి ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే.. ఆ తర్వాత తీసిన చిత్రాల్లో ‘అర్జున్’ మినహా మిగతా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో గుణ ఇమేజ్ చాలావరకు తగ్గిపోయింది. ఇలా ఓ ఉన్నతస్థానం నుంచి కిందకు పడిపోయిన గుణ.. తిరిగి తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డాడు. తన స్వీయ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ వెచ్చించి.. ‘రుద్రమదేవీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు.

నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాల్సి వుండేది. కానీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ లో జాప్యం జరుగుతూ వస్తుండటంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. పైగా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన క్రమంలో.. ఈ సినిమా విడుదలపై గుణశేఖర్ క్లారిటీ ఇవ్వలేకపోయాడు. దీంతో ఎంతో ఆసక్తిగా ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా నిరాశకు గురయ్యారు. ఈనెల 26న విడుదల చేస్తున్నట్లు మొన్నీమధ్య గుణ వెల్లడించాడు కానీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల మళ్లీ వాయిదా వేసినట్లు ప్రకటించాడు. దీంతో ఈ సినిమాపై తరువాత సమాచారమేంటో తెలుసుకునే విషయమై ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగానే తాజాగా గుణశేఖర్ ఈ మూవీ విడుదల తేదీపై స్పందించాడు.

దర్శకుడు గుణ మాట్లాడుతూ.. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందనీ.. చివరి దశకి చేరుకుందని చెప్పాడు. తాను ఆశించిన అవుట్ పుట్ రాని పక్షంలో ముందుగా చెప్పిన తేదీకి విడుదల చేయలేకపోయానని స్పష్టం చేశాడు. ప్రేక్షకులను మెప్పించే అవుట్ పుట్ రాబట్టే ప్రయత్నంలో వున్నామని తెలిపాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్లు గుణ చెప్పాడు. అనేక విశేషాలతో స్టీరియో స్కోపిక్ 3డీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ ప్రేక్షకులను తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి.. ఈ సినిమా అతడు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rudramadevi  director gunasekhar  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more