A Special News on Actor Adivi Sesh | Bahubali Movie Updates | Tollywod Young Heroes

Adivi sesh special news different character roles bahubali updates

adivi sesh news, adivi sesh updates, adivi sesh movies, adivi sesh interview, adivi sesh special news, adivi sesh star diary, adivi sesh photo shoot, adivi sesh photos, adivi sesh images, adivi sesh bahubali, bahubali movie news, bahubali updates

Adivi sesh special news different character roles bahubali updates : A Special News on Actor Adivi Sesh who is doing different character roles in every movie and improve his skills.

వైవిధ్య పాత్రలతో మెప్పిస్తున్న యువహీరో

Posted: 06/06/2015 02:57 PM IST
Adivi sesh special news different character roles bahubali updates

‘కర్మ’లాంటి వైవిధ్యభరితమైన కథాచిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అడవిశేష్! ఇక అప్పటినుంచి తన సినీప్రస్థానాన్ని కొనసాగించిన ఈ హీరో.. ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒక విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా, హీరోగా తనను తాను మలుచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు ఈ హీరో! అవకాశం వస్తే చాలు ఏదైనా సినిమాలో నటిద్దామని అనుకుంటున్న ఈ రోజుల్లో.. అందుకు భిన్నంగా ఆలోచించి ప్రత్యేక పాత్రల్లో నటించాడు శేష్!

ప్రస్తుతం పోటీ ఎక్కువగా వున్న ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సాధించాలంటే అందుకు వైవిధ్యమే బెస్ట్ అనుకుంటూ ముందుకు నడిచాడు. అదే అతనిని తారాస్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఉదాహరణగా ఈయన నటించిన ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్’ లాంటి సినిమాలనే తీసుకోవచ్చు. ‘పంజా, బలుపు’ సినిమాల్లో విలన్ గానూ.. ‘రన్ రాజా రన్’ సినిమాలో ఓ పోలీస్ పాత్రలోనూ పూర్తిగా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తాజాగా ‘దొంగాట’ చిత్రంతో హీరోగా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంకో విశేషం ఏమిటంటే.. ‘అసుర’ సినిమాకి తన వాయిస్ ఓవర్ అందించిన ఈ యువహీరో.. ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనువిందు చేయనున్నాడు. ఈ అవకాశాన్ని కల్పించిన దర్శకధీరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన శేష్... ఆ పాత్ర తన కెరీర్ లో మైలురాయని, దాంతో తన ఇమేజ్ మరింత పాపులర్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో మెప్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.

ఇలా ఈ విధంగా అరుదైన పాత్రల్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ హీరో.. త్వరలోనే మరో రెండు సినిమాల్లో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజానికి మొదట్లో ఈ హీరోకి మైనస్ మార్కులు పడ్డా.. ఇండస్ట్రీలో నిర్వహించిన పరీక్షల్లో నెగ్గుకుంటూ ఇప్పుడు సక్సెస్ ఫుల్ నటుడిగా ప్రూఫ్ చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adivi sesh  bahubali  tollywood young heroes  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more