చిత్రపరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే రొటీన్ కు భిన్నంగా చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే.. ఇటీవలేకాలంలో యువహీరోల మధ్య ఈ ప్రయోగాత్మక పోటీ బాగానే పెరిగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న సినిమాలతోపాటు స్టార్ హోదాల వుండే వారందరి మధ్య తమకూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం సరికొత్త కథనాలతో యువహీరోలు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ హీరోల కోవలో నారారోహిత్ ఎప్పటికీ ముందుంటాడు.
ఇప్పటివరకు ఇతను నటించిన సినిమాలన్నీ వెరైటీ కథనాలతో తెరకెక్కడంతోపాటు సమాజానికి సందేశాన్నందిచేలా వున్నాయి. అందుకే.. ఇతనికి సెలక్టివ్ హీరో అనే పేరు కూడా వచ్చింది. రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వంటి కథాచిత్రాలతో ఈ నటుడు ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఇటీవలే ‘రౌడీఫెలో’తో యాక్షన్ హీరోగా తన కమర్షియల్ స్టామినాను నిరూపించుకున్న ఈ నటుడు.. తాజాగా మరో భారీ యాక్షన్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం! ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు కూడా అప్పుడే మొదలయ్యాయి కూడా!
నారా రోహిత్ తాజాగా పచ్చజెండా ఊపిన కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మరో హీరోగా ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ చిత్రంలో ‘రాయల్‌రాజు’గా తన నటనతో తెలుగు ప్రేక్షకులతోపాటు విమర్శకులను కూడా మెప్పించిన శ్రీ విష్ణు నటిస్తున్నాడు. ‘అయ్యారే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్.కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. 1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వశిష్ట మూవీస్ బ్యానర్‌పై నూతన నిర్మాతలు హరి, సన్నీరాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఎవరో ఖరారు కాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more