‘లౌక్యం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన టాలీవుడ్ మ్యాచో మేన్ గోపీచంద్.. ఇటీవలే ‘జిల్’ సినిమాతో జిగేల్ మనిపించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ తరహా సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో తన తదుపరి చిత్రానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో తన మనసులో వున్న మాటను బహిర్గతం చేశాడు.
హీరో ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేయాలనుందని గోపీచంద్ తాజాగా వెల్లడించాడు. గతంలో వీరిద్దరూ కలిసి ‘వర్షం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే! అందులో ప్రభాస్ హీరోగా నటించగా... గోపీచంద్ విలన్ గా నటించాడు. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత గోపీచంద్ హీరోగా మారాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్నట్లు కోరిక తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మాట్లాడుతూ.. ‘నేను, ప్రభాస్ మంచి స్నేహితులం. మా ఇద్దరికీ తగ్గ మంచి కథ దొరికితే ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం. ఇప్పటికే కొన్ని కథలు విన్నాం కానీ.. సరైన కథ దొరకడం లేదు. దొరికితే.. మల్టీస్టారర్ ఖచ్చితంగా చేస్తాం’ అని తెలిపాడు. ఇక ఇటీవలే ఇతను నటించిన ‘జిల్’ సినిమా విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తన లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more