Prabhas marriage relative girl rumours bahubali shooting

prabhas news, prabhas marriage news, prabhas bahubali updates, prabhas marriage updates, prabhas movies, prabhas affairs, prabhas latest news, prabhas marriage, west godavari girls

prabhas marriage relative girl rumours bahubali shooting : the rumours going viral about hero prabhas that he will ready to marriage with his relative girl.

బంధువుల అమ్మాయితో పెళ్లికి ప్రభాస్ ఓకే చేశాడట!

Posted: 03/06/2015 01:44 PM IST
Prabhas marriage relative girl rumours bahubali shooting

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నోరకాల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలపై ప్రభాస్ ఏనాడూ స్పందించలేదు. మ్యారేజ్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. అతను మాత్రం నవ్వుతూ సైలెంట్‌గా వుండిపోతాడు. బాహుబలి షూటింగ్ సమయంలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ ఆమధ్య ప్రచారం సాగింది. చివరకు ఈ చిత్రం పూర్తి అయ్యేవరకు అతను పెళ్లి చేసుకునే అవకాశాలు లేవని అప్పుడే తేలిపోయింది. బాహుబలి రిలీజ్ కావడం, ప్రభాస్ వివాహం చేసుకోవడం రెండూ ఒకేసారి జరిగే సూచనలున్నాయని ఇంటర్నెట్, మీడియాలో వార్తలొచ్చాయి.

ఆ విషయాలెలావున్నా.. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ హీరో పెళ్లికొడుకు కాబోతున్నాడని, బంధువుల అమ్మాయితో వివాహం చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో వుండే తన బంధువుల అమ్మాయిని మ్యారేజ్ చేసుకునేందుకు ప్రభాస్ ఓకే చేశాడని వార్తలు వెలువడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌లో ఈ హీరో వివాహం జరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి.. ప్రభాస్ ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేడా..? లేదా..? ఈ వార్తలు కూడా రూమర్లేనా..? లేకా నిజమా..? అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే!

ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా ప్యాచ్ వర్కుల్లో బిజీగా వున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే దశరథ్ లతో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! ఆ రెండు మూవీల స్ర్కిప్ట్ వర్క్ లు జరుగుతున్నాయని తెలిసింది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas marriage  tollywood news  bahubali updates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more