Tokyo Olympics: India Men's Hockey Team Wins Bronze సాయమందిచిన వారికి ఛాను ప్రేమపూర్వక కానుక

Mirabai chanu felicitates truck drivers who helped her travel during her training days

Mirabai Chanu felicitates truck drivers, truck drivers helped mirabai chanu travel, mirabai chanu training days, mirabai chanu, mirabai chanu rewards truck drivers who gave her lifts, tokyo olympics india medals, mirabai chanu thanks truck drivers for lifts, good news, viral news, Tokyo 2020 Olympic Games, Olympic Stadium, Tokyo Olympics

Olympic silver medalist Mirabai Chanu felicitated truck drivers in her hometown who helped her travel during her training days. The truck drivers helped her during her early days when she had to travel 30 kilometers everyday from her hometown of Nongpok Kakching to Imphal for training. Mirabai and her family members handed out gifts to the truck drivers.

సాయమందిచిన వారికి ఛాను ప్రేమపూర్వక కానుక

Posted: 08/06/2021 09:02 PM IST
Mirabai chanu felicitates truck drivers who helped her travel during her training days

టోక్యో ఒలింపిక్స్ రెండో రోజునే భారత్ కు రజత పతకం అందించి యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రస్తుతం స్వగ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా, 150 మంది ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఆమె చిరు కానుక అందించింది. మీరాబాయి చాను స్వగ్రామం నాంగ్పోక్ కాక్చింగ్. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, చాను ప్రతిరోజూ ప్రాక్టీసు కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పోర్ట్స్ అకాడెమీకి వెళ్లి వచ్చేది.

ఈ క్రమంలో ఆమె డబ్బులు లేక తమ గ్రామం నుంచి నగరానికి వెళ్లే ఇసుక లారీలను ఆశ్రయించేది. ఆ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు ఎంతో ఉదారంగా చానును ఉచితంగా ఎక్కించుకుని ఇంఫాల్ వరకు తీసుకువెళ్లేవాళ్లు. టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు చాను ప్రాక్టీసు ఆ విధంగానే సాగింది. దాంతో, తాను రజతం గెలవడం వెనుక ఈ ట్రక్ సిబ్బంది సాయం కూడా ఉందని భావించిన చాను వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి విందు ఏర్పాటు చేసింది. అంతేకాదు, ప్రతి ఒక్కరికీ ఒక షర్టు, మణిపురి స్కార్ఫ్ ను కానుకగా ఇచ్చి వారి పట్ల తన కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించింది .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMirabai Chanu  Truck Drivers  Felicitation  Rewards  traveling  training days  Imphal  Manipur  Tokyo Olympics  sports  

Other Articles

Today on Telugu Wishesh