Kidambi Srikanth lose in quarterfinals హాంకాంగ్ ఓపెన్: ముగిసిన భారత షెటర్ల పోరు..

Hong kong open kidambi srikanth lose in quarterfinals

Srikanth Kidambi, PV Sindhu, Kidambi Srikanth, Kenta Nishimoto, hong kong open 2018, Hong Kong Open, badminton match today, cricket news, indian badminton news, sports news, sports, latest sports news, badminton, badminton news

Hong Kong Open World Tour Super 500 tournament: ourth seed Srikanth suffered a 17-21 13-21 loss to eighth seed Kenta Nishimoto. Sameer Verma failed to tame Lee Cheuk Yiu.

హాంకాంగ్ ఓపెన్: ముగిసిన భారత షెటర్ల పోరు..

Posted: 11/16/2018 06:07 PM IST
Hong kong open kidambi srikanth lose in quarterfinals

కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ లో భారత షట్లర్లు వరుసగా ఇంటిబాట పడుతున్నారు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. నిన్న రెండో రౌండ్‌లో పీవీ సింధు పరాజయాన్ని చవిచూసింది. కాగా ఇవాళ పురుష షెటర్ల వంతు వచ్చింది. కిదాంబి శ్రీకాంత్ తో పాటు సమీర్ వర్మ కూడా ఇవాళ వారి బాటలోనే పయనిస్తూ.. ఇంటిముఖం పట్టారు.

వరుసగా రెండు విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిమిపాలయ్యాడు. జపాన్‌ షట్లర్ కెంటా నిషిమోతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచులో కిదాంబి శ్రీకాంత్ 17-21, 13-21 తేడాతో మ్యాచ్ ను చేజార్చుకుని.. హాంకాంగ్ ఓపెన్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక గాయం కారణంగా చైనా షట్లర్ చెన్ లాంగ్ నిన్న పోటీ నుంచి తప్పుకోవడంతో క్వార్టర్స్ చేరిన సమీర్‌ కూడా ఇవాళ ప్రత్యర్థి లీ చీయూక్ యూ చేతిలో పరాజయం పాలయ్యాడు.

టోర్నీలో భాగంగా నిన్న ప్రణయ్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో 18-21, 30-29, 21-18 తేడాతో అతికష్టంగా గెలుపొందిన కిదాంబి శ్రీకాంత్.. ఈరోజు జపాన్ షట్లర్‌కి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాడు. తొలి సెట్‌ని చేజార్చుకున్న తర్వాత పూర్తిగా ఒత్తిడిలో పడిపోయిన శ్రీకాంత్.. రెండో సెట్‌లో వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశాలిచ్చేశాడు. దీంతో.. నిమిషాల వ్యవధిలోనే కెంటా తిరుగులేని స్థితికి చేరుకుని.. అలవోకగా మ్యాచ్‌‌ని చేజిక్కించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles