Bardhan, Sarkar win gold on bridge బ్రిడ్జి ఆటలో భారత్ ఖాతాలోకి స్వర్ణం

Bardhan sarkar win gold on bridge s debut at 18th asian games

singapore, Pranab Bardhan, Shibhnath Sarkar, Bridge, India, gold medal, China, Lixin Yang, Gang Chen, Indonesia, Asian Games, sports

In bridge's debut at the Asian Games, India clinched a gold in the men's pair event, in which India was represented by Pranab Bardhan and Shibhnath Sarkar. With this win, 60-year-old Bardhan also became the oldest Indian man this year to win a medal.

బ్రిడ్జి ఆటలో భారత్ ఖాతాలోకి స్వర్ణం

Posted: 09/01/2018 05:38 PM IST
Bardhan sarkar win gold on bridge s debut at 18th asian games

ఆసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. శనివారం వరుసగా రెండు స్వర్ణాలతో భారత్‌ దూసుకుపోతోంది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. గతంలో ఎన్నడూ సాధించని స్థాయిలో భారత్‌ పతకాలు సాధించింది. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 15 స్వర్ణాలు సాధించింది.

1951లో మాత్రమే భారత్‌ 15 స్వర్ణాలు సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రికార్డును సమం చేసింది. మరోవైపు ఇప్పటి వరకూ మొత్తం సాధించిన పతకాల సంఖ్య(67)ను చూస్తే ఆసియా క్రీడల్లో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. శనివారం మొదట పురుషుల బాక్సింగ్ లో 49 కేజీల విభాగంలో భారత్‌ తొలి స్వర్ణం అందుకుంది. ఆ తర్వాత బ్రిడ్జ్‌లో మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పురుషుల పెయిర్‌ ఫైనల్‌-2లో అగ్రస్థానంలో నిలిచిన ప్రణబ్‌-సర్కార్‌ జోడీ స్వర్ణం సాధించింది.

తొలిసారిగా బ్రిడ్జి ఫెయిర్ ఈవెంట్ ను అసియా గేమ్స్ లో ఈసారి ప్రవేశపెట్టారు. కాగా ఈ గేమ్ లో ఆరంభ పతకాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ పతకంతో ఇప్పటి వరకూ భారత్‌ ఖాతాలో 67 పతకాలు చేరాయి. ఇందులో స్వర్ణాలు 15, రజతాలు 23, కాంస్యాలు 29 ఉన్నాయి. ఈ విజయంతో 60 ఏళ్ల వయస్సులోనూ పతకాన్ని సాధించిన వ్యక్తిగా బర్థన్ మరో రికార్డును కూడా సాధించాడు. అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా బంగారు పతకాన్ని సాధించిన రికార్డు ఇప్పుడు బర్థన్ పేరును లిఖించబడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singapore  Pranab Bardhan  Shibhnath Sarkar  Bridge  India  Asian Games  sports  

Other Articles