India clinch three gold medals కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో పది స్వర్ణాలు..

Cwg 2018 day 5 india clinch three gold medals

cwg 2018 live, jitu rai, saina nehwal, table tennis, badminton, air pistol firing, cwg 2018 live updates, cwg 2018 india live, commonwealth games 2018 live, 2018 commonwealth games live, india cwg live, cwg live streaming, cwg 2018 live streaming, cwg news, sports news,sports, latest sports news

India added seven medals — including three gold medals — to its kitty on Day 5 of the Commonwealth Games after it clinched gold in the mixed-team badminton event and the men’s table tennis team event.

కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో పది స్వర్ణాలు..

Posted: 04/09/2018 07:37 PM IST
Cwg 2018 day 5 india clinch three gold medals

అస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన హావాను కొనసాగిస్తుంది. భారత క్రీడాకారులు తమ అధ్భుత ప్రదర్శనలతో సత్తాను చాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. మొత్తంగా పది పసిడి, నాలుగు రజత, ఐదు కాంస్య పతకాలతో మొత్తంగా 19 పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకుని కామన్వెల్త్ గేమ్స్ లో టాప్ త్రి ప్లేస్ లో కొనపాగుతుంది. అస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ రెండో స్థానంలో వుంది. అయితే భారత్ మాత్రం మూడో స్థానంలోనే స్థిరంగా కొనసాగడం గమనార్హం.

ఇవాళ భారత్ ఖాతాలోకి మూడడు స్వర్ణాలు చేరాయి. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో జీతూరాయ్‌ స్వర్ణ పతకాన్ని సాధించగా,  ఆ తరువాత భారత్ ఖాతాలోకి మరో పసిడి పతకం వచ్చి చేరింది. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. తుదిపోరులో భారత జట్టు నైజీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్ కు ఇది తొమ్మిదో స్వర్ణం కావడం విశేషం. ఇక తాజాగా భారత్ మిక్సిడ్ డబ్సుల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. మునుపెన్నడూ లేని విధంగా సైనా అద్భుత తీరులో అడి.. ఢిపెండింగ్ చాంఫియన్స్ మలేసియా జట్టను ఓడించి స్వర్ణాన్ని అందుకుంది.

ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఓమ్ మితర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. ఇక ఇదే ఈవెంట్ లో మహిళల విభాగంలో జరిగిన పోటీలలో మెహులి ఘోష్‌, అపూర్వి చండేలా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 105 కేజీల వెయిట్‌ లిఫ్టింగ్‌ ఈవెంట్‌లో ప్రదీప్‌ సింగ్‌ మొత్తం 360 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటి వరకు గెలిచిన పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ అగ్రస్థానాల్లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cwg 2018  jitu rai  saina nehwal  table tennis  badminton  air pistol firin g  sports  

Other Articles