ప్రపంచ బ్యాడ్మింటన్ అంబాసిడర్ గా సైనా Saina Nehwal named Integrity Ambassador

Saina nehwal named integrity ambassador to promote clean sport

Saina Nehwal, Integrity Ambassador, Badminton World Federation, Christinna Pedersen, Viktor Axelsen, Misaki Matsutomo, Ayaka Takahashi

"We want to continue being successful so we can live up to this honourable title and focus attention on playing clean and honestly."

ప్రపంచ బ్యాడ్మింటన్ అంబాసిడర్ గా సైనా

Posted: 12/14/2016 06:55 PM IST
Saina nehwal named integrity ambassador to promote clean sport

భారత బ్యాడ్మింటన్ క్రీడలలో మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా రాణించి.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగోన్న సైనా నెహ్వాల్ మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ సైనా నెహ్వాల్ ను తమ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఈ విషయాన్ని దుబాయ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ ప్రారంభోత్సవం సంరద్భంగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఢిఫ్యూటీ ప్రెసిడెంట్ గస్టావో సలజార్ డెల్గాడో ప్రకటించారు.

బ్యాడ్మింటన్ ను మరింత అభివృద్ధి చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ తీసుకున్న సరికొత్త చర్యల్లో ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ కొత్తది. బీడబ్ల్యూఎఫ్ తరఫున అంబాసిడర్లు ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్ పై విస్తృత ప్రచారం చేస్తారని సలాజర్ చెప్పారు. అంబాసిడర్లుగా ఎంపికైన ప్లేయర్లకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా సలాజర్ అంబాసిడర్లను మీడియాకు పరిచయం చేశారు.

కాగా, సైనాతో పాటు మొత్తం ఐదుగరు టాప్ ప్లేయర్లను ఫెయిర్ అండ్ హనరబుల్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ అంబాసిడర్స్ గా ఎంపిక చేసిన బీడబ్ల్యూఎఫ్ అందులో సైనాను కూడా ఎంపిక చేసినట్లు చెప్పింది. డెన్మార్క్ కు చెందిన క్రిస్టిన్నా పిడెర్సెన్, విక్టర్ అక్సెల్సెన్ లు, జపాన్ కు చెందిన డబుల్స్ పెయిర్ మిసాకి మత్సుతోమో, అయకా తకాహషిలు కూడా ఇందులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles