ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలం సాకారమైందని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. దీని కోసం గత 12 ఏళ్లుగా శ్రమిస్తున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్ భారత్కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్ బుధవారం ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తనను ఘనంగా స్వాగతించడం పట్ల సాక్షి మాలిక్ సంతోషం వ్యక్తం చేసింది. ఇదో అద్భుతమైన అనుభవమని వ్యాఖ్యానించింది. దేశానికి పతకం సాధించిపెట్టడం గర్వకారణంగా ఉందని పేర్కొంది.
విమానాశ్రయంలో ఇంత ఘనంగా తన కుమార్తెకు స్వాగతం లభిస్తుందని ఊహించలేదని ఆమె తండ్రి సత్బీర్ అన్నారు. ఇది గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి సాక్షి మాలిక్ చేరుకుంది. ఇక్కడే భారీ జనసమూహం మధ్య ఆమెకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సన్మానం చేయనున్నారు. అయితే ఒలింపిక్ పతకాలు సాధించడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంటుంది, అపారమైన త్యాగాలుంటాయి.. చివరకు తమకు ఎంతో ఇష్టమైన తిండి కూడా తినలేక కడుపు మాడ్చుకోవాల్సి ఉంటుందని అమె అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more
Dec 16 | భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో... Read more
Nov 30 | ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో... Read more