The coin flip before Colombia-Paraguay somehow landed on its edge

Copa america match delayed after toss coin lands on its edge

Paraguay, Colombia, Copa America, football match, football toss coin edge, coin flip in ootball match, Football. latest Football news. sports. sports news

The Copa America match between Colombia vs Paraguay was delayed by a few second after the coin used for the toss landed on its edge.

ఫుట్ బాల్ మ్యాచ్ టాస్ లో వింత ఘటన..

Posted: 06/09/2016 07:43 PM IST
Copa america match delayed after toss coin lands on its edge

కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి ఇక్కడ కొలంబియా-పరాగ్వే మ్యాచ్ సందర్భంగా తొలుత వేసిన టాస్ కాస్తా ఎడ్జ్(వోర)గా పడటం ఆసక్తికరంగా మారింది.  టాస్ లో భాగంగా కొలంబియా-పరాగ్వే కెప్టెన్లతో పాటు, నలుగురు అధికారులు ఫీల్డ్లోకి వచ్చారు. అనంతరం గాల్లో ఎగురువేసిన కాయిన్ గడ్డిలో నిటారుగా నిలబడి పోయింది.

దాంతో ఇరు జట్ల కెప్టెన్లు, అధికారులు నవ్వుకుంటూ మరోసారి ఆ కాయిన్ తీసుకుని టాస్ వేశారు. ఇలా ముందుగా టాస్ వేసిన కాయిన్ ఎడ్జ్ గా పడటంతో ఆ మ్యాచ్కు ఆరంభానికి కాస్త ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో కొలంబియా 2-1 తేడాతో గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. కొలంబియా తరఫున కార్లోస్ బాకా, జేమ్స్ రోడ్రిగ్వేజ్ తలో గోల్స్ చేసి విజయంలో సహకరించారు.ఆపై పరాగ్వే 71వ నిమిషంలో గోల్ మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Copa America  Colombia  Paraguay  football match  toss  

Other Articles