Teary-eyed Mary Kom alleges regional bias in selection

Sports ministry pledges support to mary kom after boxing legend alleges regional bias

Mary Kom,sports ministry,mary kom alleges regional bias,sports ministry support for mary kom,pinki jangra,mary kom vs pinki jangra,sarbananda sonowal,Indian boxing,2016 rio olympics

The Sports Ministry have confirmed their support to star Indian boxer Mary Kom, after accusing the Indian selectors of showing regional bias during selections and trials for boxing events.

భావోద్వేగానికి గురైన మేరీకోమ్ కు బాసటగా కేంద్ర క్రీడా శాఖ

Posted: 09/25/2015 05:39 PM IST
Sports ministry pledges support to mary kom after boxing legend alleges regional bias

భారత బాక్సింగ్ ఛాంపియన్, మణిపూర్ మణిమకుటం, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్  అన్యూహ్యంగా తనకెదురైన, ఎదరువుతున్న వివక్షల పట్ల, ప్రాంతీయ విద్వేశాల పట్ల బావోద్వేగానికి లోనై.. కన్నీటి పర్యంతమయ్యారు. భారతదేశంలో మహిళ బాక్సర్లెందరికో ఒక స్ఫూర్తిగా నిలిచిన ఆమె ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది. సెలక్షన్ ప్రక్రియలో బాక్సింగ్ రిఫరీలు, జడ్జిలు తనపై వివక్ష చూపిస్తున్నారని  మేరో కోమ్ ఆరోపించారు.. వారి  ప్రాంతీయ దురభిమానం వల్ల తనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

తాను ఈశాన్య భారతానికి చెందినదాన్ని కావడంతోనే తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ముందు తాను భారతీయురాలిని అనే విషయాన్ని గమనించాలన్నారు. తన చేతిలో అనేకసార్లు ఓడిపోయిన హర్యానాకు చెందిన పింకీ జాంగ్రాకే  సెలక్లర్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఒలింపిక పతక విజేత మేరీకోమ్ వాపోయింది. అయినా తాను నిరుత్సాహపడననీ,  తనకీ అవమానాలు, వివక్ష కొత్తకాదనీ, గతంలో ఇలాంటివి చాలా అనుభవించానన్నారు. తానేంటో బాక్సింగ్ రింగ్ లో నిరూపించుకుంటానంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయింది. దీంతో కదిలిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అమెకు మద్దతుగా నిలిచింది. మేరీకోమ్ ఏ విషయంలోనూ అధైర్యపడవద్దని సూచించింది. అమెకు కావాల్సిన అన్ని వసతులను, సౌకర్యాలను తాము పొందుపరుస్తామని హామి ఇచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mary kom  boxing  breaks down  regional bias  haryana  pinki jangra  

Other Articles