Hockey India | Olympics | Reo

Womens hockey team end 36 year olympics wait as ritu rani and co seal their rio berth

India, Hockey, Olympics, Reo Olympics, Ritu Rani, Hockey India

As India celebrates National Sports Day to honour its greatest ever hockey player Dhyand Chand, Indian women's hockey team script history. Ritu Rani and her team will return to the Olympics after a long gap of 36 years as they qualified today for next year's Rio Games, courtesy of England making it to the final of the ongoing EuroHockey Championships in London.

36 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లోకి భారత మహిళ హాకీ టీం

Posted: 08/29/2015 05:31 PM IST
Womens hockey team end 36 year olympics wait as ritu rani and co seal their rio berth

అవును.. ఒకటి కాదు రెండు కాదు 36 ఏళ్ల తర్వాత ఇండియన్ ఉమెన్ హాకీ టీం ఒలంపిక్స్ లో చోటు దక్కించుకుంది. వచ్చే ఏడాది జరిగే రియో ఒలంపిక్స్ లో భారత మహిళా జట్టు భారత్ నుండి ప్రాతినిధ్యం వహించడం నిజంగా విశేషం. భారత క్రీడగా హాకీ ఉన్నా కానీ 36 ఏళ్ల తర్వాత హాకీ ఆడేందుకు అర్హత సాధించడం కొంత బాధ కలిగిస్తున్నా కానీ కనీసం ఇప్పటికి ఒలంపిక్స్ లో పాలుపంచుకునే అవకాశం రావడం మంచిదే. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఈమేరకు ఓ ప్రకటన చేసింది. భారత్ రియో ఒలంపిక్స్ లో పాల్గొనేందుక అర్హత సాధించిందని ప్రకటన చేసింది. ఇంగ్లాండ్, నెదర్లాండ్ లతో పాటు బారత్ ఇందులో ఉంది. ఎంతో కాలం తర్వాత బారత హాకీ జట్టు ఒలంపిక్స్ లో పాల్గొనే అవకాశం రావడం మీద క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2016లో జరిగే రియో ఒలంపిక్స్ లో పాలుపంచుకునేందుకు మొత్తం పది టీంలలో భారత్ కూడా ఒకటి. చివరి సారిగా భారత మహిళల హాకీ జట్టు 1980లో జరిగిన మకావ్ ఒలంపిక్స్ లో పాలుపంచుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఒలంపిక్స్  అర్హత సాధించలేదు మన మహిళల హాకీ జట్టు. భారత క్రీడా ప్రపంచానికి ఇది ఎంతో మంచి వార్త అని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒలంపిక్స్ లో అర్హత సాధించడం నిజంగా ఆనందంగా ఉందని హాకీ ఇండియా ప్రెసిడెంట్ నరేందర్ బాట్రా వెల్లడించారు. హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత క్రీడా ప్రపంచానికి ఎంతో స్వీట్ న్యూస్ అని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Hockey  Olympics  Reo Olympics  Ritu Rani  Hockey India  

Other Articles