Women's Junior Boxing | five medals | India

India bag five medals in women s junior boxing

India Bag Five Medals, Women's Junior Boxing, Three Indian boxers, Savita, Mandeep, Sandhu, Sakshi, gold medals, Soniya, Gonella Niharika, silver medals, AIBA Women\'s Junior World Boxing Championship, Five Indians, World Jr Women's Boxing

Three Indian boxers, Savita, Mandeep Sandhu and Sakshi clinched gold medals, while Soniya and Gonella Niharika won silver medals in the AIBA Women's Junior World Boxing Championships here on Saturday.

మహిళల జూనియర్ బాక్సింగ్ లో మెరిసిన భారత్

Posted: 05/23/2015 11:17 PM IST
India bag five medals in women s junior boxing

భారత మహిళా బాక్సర్లు మరోసారి మెరిశారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) టోర్నీలో భాగంగా ఇక్కడ శనివారం జరిగిన మహిళల జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత మహిళలు తమ సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో జరిగిన పోరులో  ఐదుగురు భారత బాక్సింగ్ క్రీడాకారుణులు విజయం సాధించి భారత్ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. దోహా వేదికగా జరిగిన జూనియర్ మహిళా బాక్సింగ్ చాంఫియన్ షిప్ లో ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళలు పతకాలను సాధించారు. వారిలో ముగ్గురు బాక్సింగ్ లో పసిడి పతకాలను అందించగా, మరో ఇద్దరు వెండి పతకాలను సాధించారు.
 
50కేజీల విభాగంలో తుదిపోరులో బారత్ తరపున తలపడిన సవిత.. ఉక్రెయిన్ కు చెందిన రోహోవా కటర్నను 3-0తో ఓడించి బంగారు పతకాన్ని సాధించింది. 52 కేజీల విభాగంలో జరిగిన తుదిపోరులో భారత క్రీడాకారిణి మన్ దీప్ సింధూ ఐరిష్ కు చెందిన క్రీడాకారిని ఎర్లీ న్యామ్ ను 3-0 తో ఓడించింది బంగారు పతకాన్ని సాధించింది. ఇక 54 కేజీల విభాగంలో జరిగిన తుదిపోరులో భారత క్రీడాకారిణి సాక్షి అమెరికాకు చెందిన రమీరెజ్ యాన్సెల్ ను 3-0తో ఓడించి మూడవ పసిడి పతకాన్ని సాధించింది. 48 కేజీల విభాగంలో  భారత్ బాక్సింగ్ క్రీడాకారిని సోనియా తుదిపోరులో ఓటమితో రజత పతాకాన్ని సాధించగా, అటు 70 కేజీల విభాగంలోనూ నిహారిక గోనెల్లా అమెరికా క్రీడాకారిణ చేతిలో పరాజయంతో రజతపతకాన్ని దక్కించుకుంది.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Five Indians  World Jr Women's Boxing  

Other Articles