Belgian footballer Gregory Mertens in artificial coma after collapsing during match

Belgian footballer critical after collapsing

Belgian footballer critical after collapsing, Gregory Mertens in artificial coma, sports, soccer, Gregory Mertens, Gregory Mertens news, Gregory Mertens hospital, Gregory Mertens injury, beligan football, football, soccer sport, phillip huges, australian cricketer,

Gregory Mertens of Jupiler Pro League side Lokeren suffered a cardiac arrest in a game against Genk. Play was stopped 25 minutes in after the 24-year-old defender suddenly went down.

ఫుట్ బాల్ అడుతూ.. కుప్పకూలిన బెల్జియన్ క్రీడాకారుడు

Posted: 04/29/2015 05:06 PM IST
Belgian footballer critical after collapsing

పిట్ గా వుండే క్రీడాకారులు ఈ మధ్య గుండెపోటుకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన నెట్ బాల్ క్రీడాకారుడు మయూరేష్ పవార్.. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన జాతీయ క్రీడలలో పాల్గోన్న అనంతరం గుండెపోటుతో మరణించగా, తాజాగా, బెల్జియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు గ్రగరీ మెర్టెన్స్ ఆటమధ్యలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. 24 ఏళ్ల మెర్టెన్స్.. మంగళవారం నాడు గెంక్తో జరుగుతున్న మ్యాచ్లో 20 నిమిషాల పాటు చురుగ్గానే ఆడాడు.

అయితే, ఉన్నట్టుండి అతడు గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన రంగంలోకి స్టేడియం నిర్వాహకులు.. అంబులెన్స్ ను తెప్పించి అతడిని వెంటనే జీకెహ్యూస్ ఊస్ట్ లింబర్గ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని, కోమాలోకి జారుకున్నారని వైద్యులు చెబుతున్నారు. మెర్టెన్స్ జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్నాడని వైద్యులు చెబుతున్నారు. మెర్టిన్స్ కుప్పకూలడంతో 25 నిమిషాల పాటు మ్యాచ్ ను నిలిపివేసిన నిర్వహాకులు.. అనంతరం కోనసాగించారు. తన కెరీర్ను 2011లో సెర్కల్ బ్రసెల్స్తో ప్రారంభించిన మార్టెన్స్ గత ఏడాది వేసవిలో లోకెరెన్ లోకి వెళ్లాడు. నాలుగేళ్లలో మొత్తం 15 లీగ్ గేమ్స్ లో పాల్గోన్న మెర్టెన్స్ మూడు ఐరోపా లీగ్ మ్యాచ్ లలోనూ తన ప్రతిభను కనబర్చి వాటిలో రెండు మ్యాచ్ ల గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sports  soccer  Gregory Mertens  Belgian footballer  

Other Articles