Football brazil legend pele health twitter reply

football pele, pele brazil legend, brazil legend pele, pele health problems, pele twitter, twitter account, football players, worlds football champions

football brazil legend pele health twitter reply

నా ఆరోగ్యం బాగానే వుంది.. చంపకండి ప్లీజ్!

Posted: 11/29/2014 12:24 PM IST
Football brazil legend pele health twitter reply

ఫుట్’బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి విషయమంగా వుందని గతకొన్నిరోజుల నుంచి వార్తాకథనాలు వస్తున్న సంగతి తెలిసిందే! ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిందని, చికిత్స నిమిత్తం వైద్యులు ఆయన్ను ఐసీయూలో వుంచారని ప్రచారాలు జరిగాయి. అయితే ఈ వార్తలను పీలే ఖండించారు. తన ఆరోగ్యం బాగానే వుందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశాడు.

‘నా ఆరోగ్య పరిస్థితి గురించి ట్విటర్ వేదికను ఉపయోగించుకుని అందరికీ చెప్పదలుచుకున్నాను. నా ఆరోగ్యం బాగానే వుంది. శుక్రవారంనాడు నన్ను ఐసీయూలో ఉంచలేదు. ఏకాంతంగా ఉండేందుకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిలో ఉంచారు. మీ అందరి ప్రేమ, అభిమానంతో తిరిగి కోలుకోగలిగాను. ప్రస్తుతానికి ఆందోళనపడాల్సిన స్థితి లేదు. కొత్త ఏడాది సరికొత్త ఆరోగ్యంతో గడపాలనుకుంటున్నాను. అలాగే విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నాను’ అని ట్విటర్’లో ఆయన తెలిపాడు.

74ఏళ్ల పీలే మూత్ర సంబంధిత వ్యాధితో అంటే.. మూత్రపిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు ఈనెల 13వ తేదీన సర్జరీ చేయించుకున్నారు. అయితే ఆ సర్జరీ నేపథ్యంలో సోమవారం ఇన్‌ఫెక్షన్ సోకిన కారణంగా మరోసారి అడ్మిట్ అయ్యారు. పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఆయనకు హెమోడయాలసిస్ జరుపుతున్నట్టు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రి పేర్కొంది. కృత్రిమ కిడ్నీ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి పీలే శరీరంలోకి పంపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles