Ravi Shastri on picking Umran Malik for T20 World Cup టీ20 ప్రపంచకప్ కు ఉమ్రాన్ ను ఆడించొద్దు: రవిశాస్త్రి

Srh vs lsg kl rahul was tensed due to slow over rate against srh

Team India, INDvsSA, Ravi Shastri, Umran Malik, Indian Speedster, Sun Risers Hyderabad, SRH, T20 World Cup, Umran Mallik Ravi Shastri, Umran Mallik T20 World cup, cricket news, sports news, sports, cricket

Former India head coach Ravi Shastri reckons that emerging speedster Umran Malik should not be included in the Indian squad for the T20 World Cup, which will be played in October-November later this year. He said that the youngster needs to be groomed in order to be in the scheme of things.

టీ20 ప్రపంచకప్ కు ఉమ్రాన్ మాలిక్ ను ఆడించొద్దు: రవిశాస్త్రి

Posted: 06/11/2022 08:00 PM IST
Srh vs lsg kl rahul was tensed due to slow over rate against srh

ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడి తనదైన ప్రదర్శను ఇచ్చాడు. ఇక ఈ జట్టులో తురుపు ముక్కగా నిలిచాడు, ఇలాంటి బౌలర్ ను మరింత సాన పట్టి.. సాధన చేయిస్తే టీమిండియా జట్టుకు మరిన్నీ విజయాలను అందిస్తాడని ఓ వైపు క్రికెట్ అభిమానులు, క్రికెట్ ప్రముఖులు, విశ్లేషకులు అ్రభిప్రాయపడుతున్నారు.

అయితే టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రీ వాదనలు మరోలా వున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేయవద్దంటూ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ కు సెలక్టర్లు ఉమ్రాన్ మాలిక్ ను కూడా ఎంపిక చేయడం తెలిసిందే. నెట్ ప్రాక్టీస్ లోనూ అతడు చురుగ్గా పాల్గొంటున్నాడు. మాలిక్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ లో కూడా ప్రాతినిధ్యం వహించలేదు. ప్రస్తుత సిరీస్ లో ఏవైనా అవకాశం లభిస్తుందేమో చూడాలి. ఈ తరుణంలో రవిశాస్త్రి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగించింది.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్లకు మించిన వేగంతో బంతులను సంధించి మంచి ప్రదర్శన చేయడం చూశాం. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో మ్యాచుల్లో అవకాశం వస్తే సత్తా చూపిస్తాడేమో? అన్న అంచనాలున్నాయి. అయినా, అతడు ఇంకా ఎంతో మెరుగుపడాలని, అనుభవం సంపాదించాల్సి ఉందని రవిశాస్త్రి అన్నారు. అతడికి అప్పుడే అంచనాలతో అవకాశం ఇవ్వడం తొందరపాటు అవుతుందన్నాడు. ‘‘అప్పుడే టీ20ల్లో ఆడించొద్దు. ముందు అతడ్ని అనుభవం సంపాదించనీయండి. జట్టు వెంట తీసుకెళ్లండి. వీలుంటే 50 ఓవర్ల మ్యాచుల్లో (వన్డేల్లో) ఆడించండి. రెడ్ బాల్ క్రికెట్ (టెస్ట్) అయినా ఫర్వాలేదు. అతడ్ని టెస్టుల్లో తీర్చిదిద్దాలి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి’’ అని రవిశాస్త్రి తన అభిప్రాయాలను తెలియజేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles