Babar Azam's 'ILLEGAL FIELDING' costs Pakistan five runs క్రికెట్ నిబంధనలకు అతిక్రమించిన పాకిస్తాన్ కెప్టెన్

Pak vs wi babar azam s illegal fielding costs pakistan five runs during 2nd odi

Pakistan vs West Indies 2022, Babar Azam, Babar Azam fielding, Babar Azam gloves, Babar Azam illegal fielding, PAK vs WI, Babar Azam records Babar Azam ODI records, PAK vs WI odi series, Pakistan cricket team, Babar Azam funny fielding, PAK vs WI 2nd ODI,Pakistan vs West Indies 2022, Babar Azam, PCB, cricket news, sports news, sports, cricket

The Pakistan skipper inadvertently gifted the visitors five additional runs in the second ODI here on Friday. Though it did not impact the result of the match as Pakistan won by a huge 120-run margin, it did bring into focus the law of "illegal fielding".

క్రికెట్ నిబంధనల అతిక్రమణ: ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఐదు పరుగులు లభ్యం

Posted: 06/11/2022 06:49 PM IST
Pak vs wi babar azam s illegal fielding costs pakistan five runs during 2nd odi

క్రికెట్‌లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు.. జట్టు సారధే ఆట నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే.. జట్టు సభ్యులు ఎవరికి చెప్పుకోవాలని, ఏమని చెప్పాలి. ఇదిలాఉంచితే.. ఈ నిబంధనల అతిక్రమించడం వల్ల ఆయా జట్లు ఇబ్బందులు పడుతుంటాయి. తాజాగా జరుగుతున్న పాకిస్తాన్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో కూడా అదే జరిగింది. విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న పాక్ సారధి బాబర్ ఆజమ్‌ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడు.

దీంతో ఆ దేశానికి వెళ్లి క్రికెట్ అడుతున్న పర్యాటక జట్టైన విండీస్ కు ఏకంగా ఐదు పరుగులు అదనంగా లభించాయి. ఇంతకీ బాబర్ ఏం చేశాడో తెలుసా? ఫీల్డింగ్ సమయంలో రనౌట్ చేయడం కోసం వికెట్ల దగ్గరకు వచ్చాడు. ఆ సమయలో ఫీల్డర్ విసిరిన బంతిని అందుకునేందుకు కీపర్ గ్లవ్స్ తీసుకున్నాడు. కీపర్ రిజ్వాన్ నుంచి గ్లవ్ తీసుకొని, దాంతో బంతిని పట్టుకున్నాడు. ఇది చూసిన అంపైర్‌కు కోపం వచ్చేసింది, ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్ధమని చెప్పి విండీస్ జట్టుకు అదనంగా 5 పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే మ్యాచ్‌లో మాత్రం బాబర్ ఆజమ్, ఉమామ్ ఉల్ హక్ రాణించడంతో పాకిస్తాన్ విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles