RCB vs RR: Glenn Maxwell won’t play against RR రాజస్థాన్ తో మ్యాచ్ కు మాక్స్ వెల్ దూరం..

Rcb vs rr glenn maxwell won t play against rr amid cricket australia s clause

Glenn Maxwell, Australia Cricket Board, RCB, Royal Challengers Bangalore, Rajasthan Royals, Mumbai Indians, Virat Kohli, indian premier league 2022, ipl 2022, , indian premier league 2022, sports news, cricket news, sports, cricket

Dashing Australian all-rounder Glenn Maxwell has joined the Royal Challengers Bangalore (RCB) camp and has even started training with his teammates. However, he won’t be available for the side’s clash against Rajasthan Royals on Tuesday (April 5) at the Wankhede Stadium in Mumbai amid Cricket Australia’s embargo.

బెంగళూరుకు షాక్.. రాజస్థాన్ తో మ్యాచ్ కు మాక్స్ వెల్ దూరం..

Posted: 04/05/2022 07:32 PM IST
Rcb vs rr glenn maxwell won t play against rr amid cricket australia s clause

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కాస్త ఆలస్యంగా చేరిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ముఖ్యకారణం ఆయన వివాహం జరగడమే. ఎవరితో అంటే భారత్ కు చెందిన ఆయన గర్ల్ ఫ్రెండ్ విని రామన్ తో ఇటీవలే ఆయన వివాహమాడారు. గత నెల 27వ తేదీన విరిద్దరి కళ్యాణం జరిగడంతో కాసింత ఆలస్యంగా ఆయన ఐపీఎల్ లోని తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఆయన మాత్రం ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం ఆయన ఆడటం లేదు.

ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు మాక్స్‌వెల్ దూరంగా ఉండనున్నాడు. వచ్చిందే ఆలస్యంగా అంటే ఇక మ్యాచ్ లు ఆడకుండా దూరంగా ఉంటానని చెప్పడం ఏంటీ.. అన్న ప్రశ్నలు వస్తున్నాయా.? అయితే ఇక్కడ ఓ చిన్న కిటుకు ఉంది. స్వతహాగా అస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్.. ఐపీఎల్ ఆడాలంటే అందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి తప్పనిసరి. అయితే ఈ సారి క్రికెట్ ఆస్ట్రేలియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. బోర్డు నుంచి కాంట్రాక్ట్ పొందిన ఏ ఆసీస్ ఆటగాడు ఏప్రిల్ 6 లోపు ఐపీఎల్‌లో పాల్గొనకూడదు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు గ్లెన్‌ మాక్స్‌వెల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ  క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ధృవీకరించాడు. “క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్‌ ప్రకారం..  ఏప్రిల్ 6వ తేదీ లోపు కాంట్రాక్టు పొందిన ఆసీస్‌ ఆటగాళ్లు ఎవరూ  అందుబాటులో ఉండరు.  కాబట్టి గ్లెన్ మాక్స్‌వెల్ జట్టుతో చేరినప్పటికి అతడు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతడు ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. తన వివాహం కారణంగా మాక్స్‌వెల్‌ ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh