Gavaskar expresses regret over ill-timed comment on Warne ఆ విషయంలో తప్పు తెలుసుకున్న సునీల్ గవాస్కర్

Sunil gavaskar expresses regret over controversial remarks on shane warne

Shane Warne, Sunil Gavaskar, Shane Warne dies, Shane Warne Death, gavaskar, warne, shane warne, sunil gavaskar, gavaskar warne controversy, gavaskar on warne, shane warne dies, shane warne death, shane warne news, shane warne cricket, warne cricketer, shane cricketer, shane warne died, shane warne cricketer, australia shane warne, shane warne ipl, shane warne twitter, Cricket

Former India captain Sunil Gavaskar on Monday expressed regret for refusing to call the late Shane Warne as the greatest of all time while discussing his legacy, saying it was not the right time for the comparisons he made.

ఆ విషయంలో తప్పు తెలుసుకున్న సునీల్ గవాస్కర్

Posted: 03/08/2022 05:15 PM IST
Sunil gavaskar expresses regret over controversial remarks on shane warne

ఆస్ట్రేలియా దివంగత లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి అనుచితంగా మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన తప్పును గుర్తించారు. ఓ అత్యుత్తమ బౌలర్ గురించి తాను ఆ సమయంలో అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. షేన్ వార్న్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించడం తెలిసిందే. అదే రోజు ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. అందులో గవాస్కర్ పాల్గొన్నారు. ‘మీరు చూసిన అత్యుత్తమ స్పిన్నర్ వార్న్ యేనా?’ అంటూ వ్యాఖ్యాత వేసిన ప్రశ్నకు.. గవాస్కర్ ఊహించని సమాధానం ఇచ్చారు.

తన దృష్టిలో వార్న్ గొప్ప స్పిన్నర్ కాదన్నారు. ‘‘అతడి కన్నా ముత్తయ్య మురళీధరన్ మెరుగైన స్పిన్నర్. భారత్ లో వార్న్ కు గొప్ప రికార్డు లేదు. స్పిన్ పిచ్ పై బాగా ఆడగల భారత్ బ్యాట్స్ మెన్ పై మంచి రికార్డు లేని వార్న్ గొప్ప స్పిన్నర్ ఎలా అవుతాడు’’ అంటూ గవాస్కర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. షేన్ వార్న్ ను గొప్ప స్పిన్నర్ గా ప్రపంచంలో ఎక్కువ మంది గుర్తిస్తుంటారు. అటువంటి వ్యక్తి మరణించిన సందర్భంలో గవాస్కర్ అలా తక్కువచేసి మాట్లాడడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

షేన్ వార్న్ మరణించిన సందర్భంగా ఇలా వ్యాఖ్యానించడం ఏంటయ్యా? అని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. దీంతో గవాస్కర్ తప్పు తెలుసుకున్నారు. ‘‘నిజానికి ఆ ప్రశ్న అడగకూడనిది. అలాగే, నేను కూడా చెప్పకూడనిది. పోలికలకు, విశ్లేషణకు ఇది సమయం కాదు. వార్న్ క్రికెట్ లో గొప్ప ప్లేయర్. రోడ్నే మార్ష్ కూడా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. వారి ఆత్మలకు శాంతి కలగాలి’’ అని గవాస్కర్ తన స్పందన తెలిపారు. తనను అడిగిన ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెప్పానే గానీ, అందులో ఎటువంటి దురుద్దేశం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane Warne  Sunil Gavaskar  Shane Warne dies  Shane Warne Death  Cricket  sports  

Other Articles