Ajinkya Rahane does well overseas: MSK Prasad సౌతాఫ్రికా టూర్ కు రహానే.. ఎమ్మెస్కే ఏమన్నారంటే..

Selectors can pick players specific to home and away conditions msk prasad

virat kohli, rohit sharma, ajinkya rahane, MSK Prasad, rahane, kohli, india vs south africa, india tour of south africa, south africa vs india, india captain, india odi captain, india test captain, rohit, rahane dropped, kohli, coach, Cricket news, Sports news, cricket, sports

Former senior selection committee chief MSK Prasad backed Ajinkya Rahane's selection for the South Africa tour, adding that experienced players are a must for overseas tours. Prasad added that Rahane always does well in overseas conditions but his dip in form has put the Chetan Sharma-led selection committee in a spot.

సౌతాఫ్రికా టూర్ కు రహానే.. ఎమ్మెస్కే ఏమన్నారంటే..

Posted: 12/10/2021 07:09 PM IST
Selectors can pick players specific to home and away conditions msk prasad

ముంబై బ్యాట్స్ మన్ అజింక్యా రహానేను దక్షిణాఫ్రికా టూర్ కు ఎంపిక చేయడంపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఆయన టెస్టు మ్యాచులలో విఫలం అవుతున్నాడు. అయినా ఆయనను దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయనకు మద్దుతుగా నిలవగా మరికోందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా, తాజాగా రహానే ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

విదేశీ పిచ్ లపై రహానే మెరుగ్గా ఆడగలడని తెలిపాడు. ఐదు రోజుల ఫార్మాట్లో అతడికి ఉన్న అనుభవం కూడా సెలెక్టర్లను ప్రభావితం చేసి ఉంటుందని పేర్కొన్నాడు. అతడి ప్రస్తుత ఫామ్ ను పట్టించుకోకుండా, రహానే నాణ్యతను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయడం ద్వారా బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందని వెల్లడించాడు. ఎమ్మెస్కే అభిప్రాయం నిజమేనని గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ గడ్డపై రహానేకు మెరుగైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ దేశాల్లో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు సాధించింది రహానేనే. భారత్ వెలుపల టెస్టుల్లో రహానే 41 సగటుతో 3 వేలకు పైగా పరుగులు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  rohit sharma  ajinkya rahane  MSK Prasad  Rahul Dravid  BCCI  Team India  south africa  cricket  sports  

Other Articles