Sri Lanka’s first Test captain Bandula Warnapura dies శ్రీలంక తొలి టెస్టు కెప్టెన్‌ బందుల వర్ణపుర మృతి

Sri lanka s first test captain bandula warnapura dies at 68

Sri Lanka Cricket, Bandula Warnapura, ICC, Sri Lanka Cricket team, Bandula Warnapura death, Bandula Warnapura ban, Cricket news,Sri Lanka cricket, Bandula Warnapura, ICC, Sri Lanka cricket team, Bandula Warnapura death, Bandula Warnapura ban, cricket news

Bandula Warnapura, who played in two World Cups and led Sri Lanka in its first cricket test but later received a ban for participating in a rebel tour to South Africa, has died. He was 68. Warnapura led the country in its inaugural test in February 1982, facing the first ball in that match against England in Colombo.

శ్రీలంక తొలి టెస్టు కెప్టెన్‌ బందుల వర్ణపుర మృతి

Posted: 10/18/2021 07:29 PM IST
Sri lanka s first test captain bandula warnapura dies at 68

శ్రీలంక టెస్ట్‌ జట్టుకు తొలి సారధిగా వ్యవహరించిన బందుల వర్ణపుర(68) ఇకలేరు. ఆయన ఇవాళ (సోమవారం) తుదిశ్వాస విడిచారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 1982 ఫిబ్రవరిలో కొలొంబొ వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక ఆడిన తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వర్ణపుర.. శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌గా, తొలి పరుగు చేసిన ఆటగాడిగా.. అలాగే ఓపెనింగ్‌ బ్యాట్స్ మెన్ గా‌, ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేసిన తొలి ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

కెరీర్‌ మొత్తంలో 4 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన అతను.. 1975 ప్రపంచకప్‌ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. రిటైర్మెంట్‌ అనంతరం అతను శ్రీలంక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ఆయన మృతిపట్లు శ్రీలంక క్రికెట్ జట్టు, క్రికెట్ బోర్డు యాజమాన్యంతో పాటు పలువురు ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా పలువురు మాజీ క్రికెటర్లు కూడా వర్ణపుర మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandula Warnapura  warnapura  cricket news  ICC  Sri Lanka cricket team  cricket  sports news  

Other Articles