Anushka Sharma responces on Kohli steping down కోహ్లీ టీ20 పగ్గాలను వదలడంపై ప్రముఖుల స్పందనలిలా..

Celebs responces on virat kohli step down as india s t20i captain after t20 world cup

virat kohli, kohli, kohli t20, kohli captain, kohli india, india captain, india t20 captain, india t20 world cup, india cricket, Virat Kohli, T20 World Cup, Sourav Ganguly, Rohit Sharma, Ravi Shastri, Jay Shah, Dilip Vensarkar, Sunil Gavaskar, Anushka, cricket news, sports news, Cricket, sports

Team India Captain Virat Kohli announced that he will step down as India's T20 skipper after the T20 World Cup in UAE but will continue to lead the side in ODIs and Test cricket. Cricket Veterans and Celebs responces on the same, welcoming the decision that paving the way for Rohit Sharma as Captain for short format.

కోహ్లీ టీ20 పగ్గాలను వదలడంపై ఎవరెలా స్పందించారంటే..

Posted: 09/17/2021 09:02 PM IST
Celebs responces on virat kohli step down as india s t20i captain after t20 world cup

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత పొట్టి క్రికెట్ కు సార‌థ్య‌ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు వెల్ల‌డించడంపై.. టీమిండియా మాజీ సారధి.. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించారు. భార‌త క్రికెట్ కు టీమిండియా సార‌ధి విరాట్ కోహ్లీ గొప్ప ఆస్తి అని తెలిపారు. టీమిండియాను విరాట్ కోహ్లీ దిగ్విజ‌యంగా ముందుకు న‌డిపించార‌ని పేర్కొన్నారు. అయితే భ‌విష్య‌త్ కోస‌మే కోహ్లీ ఈ నిర్ణ‌యం తీసుకుని ఉండొచ్చున‌న్నారు. మూడు ఫార్మాట్ల‌లోనూ విజ‌య‌వంత‌మైన కెప్టెన్ అని గంగూలీ కొనియాడారు.

టెస్ట్ క్రికెట్ పై మ‌రింత దృష్టి సారించేందుకే టీ-20 ఫార్మాట్ సార‌ధ్యానికి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పార‌ని వెట‌ర‌న్ క్రికెట‌ర్ దిలీప్ వెంగ్‌స‌ర్కార్ వ్యాఖ్యానించారు. కోహ్లీ గొప్ప క్రికెట‌ర్‌.. టీం ఇండియాకు మ‌రుపు రాని విజ‌యాలు సాధించార‌ని పేర్కొన్నారు. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా స్పందిస్తూ.. కోహ్లీ సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని ప్ర‌శంసించారు. అయితే విరాట్ కోహ్లీ సతీమణి భార్య అనుష్క శ‌ర్మ మాత్రం ఈ విష‌యంలో కోహ్లికి మ‌ద్ద‌తుగా నిలిచింది. ప్ర‌స్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్‌లో విరాట్‌తోపాటు ఉన్న అనుష్క‌.. త‌న భ‌ర్త ప్ర‌క‌ట‌న‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ ఇది త‌న‌కు న‌చ్చింద‌ని చెప్పడానికి ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిని కూడా ట్యాగ్ చేసింది.

కాగా కోహ్లీ అంశంపై స్పందించిన సునీల్ గవాస్కర్ కోహ్లీ సారథ్య బాధ్యతలను వదిలేస్తుండటంపై ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. అయితే తనకు టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడని గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావిస్తోందని... ఈ నేపథ్యంలో రాహుల్ ను కనీసం వైస్ కెప్టెన్ చేయాలని బీసీసీఐకి సూచించారు. రోహిత్ వయసు 35 ఏళ్లని... ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. యువకుడైన కేఎల్ రాహుల్ ను కెప్టెన్ చేస్తే... భవిష్యత్తులో అతను జట్టును సమర్థవంతంగా నడపగలడని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles