Chris Cairns in intensive care after heart surgery నిలకడగా మాజీ స్టార్ క్రికెటర్ క్రిస్ కెయర్న్స్ అరోగ్యం

New zealand legend chris cairns stable after undergoing surgery

Chris Cairns, all rounder, bowler, cardiac arrest, New Zealand cricket team, Canberra, Chris Cairns critical, Heart surgery, St Vincent’s Hospital, Sydney, Chris Cairns stable, sports news, cricket news, sports, Cricket

New Zealand cricketer, Chris Cairns who was in a critical condition and on life support after suffering a major medical emergency, is reportedly stable. Chris Cairns Cairns was stabilised in Canberra last night, before being transferred to Sydney’s St Vincent’s Hospital.

నిలకడగా న్యూజీలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ క్రిస్ కెయర్న్స్ అరోగ్యం

Posted: 08/11/2021 09:34 PM IST
New zealand legend chris cairns stable after undergoing surgery

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం నిలకడగా వుంది. గత వారం ఆయన గుండెపోటుకు గురయ్యారు. తాజాగా అది మరింత విషమించింది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో చీలిక వచ్చింది. దీంతో ఆయన్ను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కెయిర్న్స్ పరిస్థితి విషమంగానే ఉన్నా చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. కాగా గుండె సర్జరీ తరువాత ఆయన అరోగ్యం నిలకడగా వుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అంతకుముందు ఆయన అరోగ్యం విషమించడంతో ఆయనకు గుండె మార్పిడి చేయాలని నిర్ణయించిన వైద్యులు.. దాత కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. కాగా, ఆయనకు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోందని కెయిర్న్స్ భార్య మెలానీ చెప్పారు. కాన్ బెర్రాలో ఉండగానే అతడి గుండెకు అతిపెద్ద సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో కాన్ బెర్రా, సిడ్నీల్లో శస్త్రచికిత్సలు చేశారన్నారు. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

తమ జట్టులోని మేటి ఆల్ రౌండర్లలో క్రిస్ కెయిర్న్స్ ఎప్పటికీ ఉంటారని చెప్పారు. క్రిస్ కెయిర్న్స్ 215 వన్డేలు, 62 టెస్టులు ఆడారు. టెస్టుల్లో 33.53 సగటుతో 3,320 పరుగులు చేసి.. 218 వికెట్లు పడగొట్టాడు. వన్డేలో 4,950 పరుగులు చేసి.. 201 వికెట్లు తీశాడు. నిజానికి ఒక్క క్రికెట్టే కాదు.. వర్చువల్ స్పోర్ట్స్ సంస్థను ఆయన నడిపారు. దుబాయ్ లో వజ్రాల వ్యాపారిగా మారారు. కానీ, ఒక్కసారిగా ఆయన ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఉన్నవన్నీ ఊడ్చుకుపోవడంతో, బతుకు బండిని నడిపించేందుకు గంటకు 17 డాలర్ల జీతానికి ఓ ట్రక్ డ్రైవర్ గా మారాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles