Team India on All India Lashkar’s hit list ఢిల్లీ మ్యాచ్ పై కన్నేసిన ఉగ్రభూతం.. భద్రత కట్టుదిట్టం..

Team india on target list nia receives anonymous warning letter

National Investigation Agency, Rohit Sharma, virat kohli, All India Lashkar, kozikhode, kerala, virat kohli, senior players, BCCI, PM Modi, bangla PM, security, delhi police, Arun Jaitely Stadium, Cricket news, sports news, Cricket, sports

The NIA received a warning letter from the anonymous. The letter revealed that there is a possible threat to the Rohit Sharma-led side. Delhi Police have been asked to beef up the security of the Indian cricket team who are scheduled to face Bangladesh in a T20 international at the Arun Jaitley Stadium in the national capital on November 3

ఢిల్లీ మ్యాచ్ పై కన్నేసిన ఉగ్రభూతం.. భద్రత కట్టుదిట్టం..

Posted: 10/29/2019 04:25 PM IST
Team india on target list nia receives anonymous warning letter

భారత పర్యటనకు వస్తున్న బంగ్లాదేశ్ తో నవంబరు 3 నుంచి సిరీస్ జరుగనున్న క్రమంలో టీమిండియా జట్టుకి ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయాన్ని నిజమేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియంలో ఈ ఆదివారం బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి టీ20లో తలపడనుండగా.. ఆరోజు భారత క్రికెటర్లపై దాడి చేయబోతున్నట్లు ఓ బెదిరింపు లేఖ ఎన్‌ఐఏ చేతికి వచ్చింది. దీంతో.. ఆ లేఖని బీసీసీఐ సెక్యూరిటీ ఏజెన్సీకి ఎన్ఐఏ పంపింది.

ఈ లేఖపై అప్రమత్తంగా వ్యవహరించాలని అటు ఢిల్లీ పోలీసులకు సూచనలు జారీ చేసిన ఎన్‌ఐఏ.. టీమ్ భద్రతని ఒకసారి సమీక్షించుకోవాలని కూడా బిసిసిఐ సెక్యూరిటీ ఏజెన్సీకి కూడా తెలిపింది. వాస్తవానికి భారత్ జట్టు ఇటీవల వెస్టిండీస్ పర్యటనకి వెళ్లిన సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమ్ భద్రతని అప్పట్లో పెంచారు. తాజాగా మరోసారి అలాంటి హెచ్చరికే వచ్చింది. అయితే.. ఈ సారి టీమిండియా‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మ్యాచ్ ను చూసేందుకు వచ్చే రాజకీయ ప్రముఖులు తమ మెయిన్ టార్గెట్‌ అని ఆ లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ హిట్ లిస్టు జాబితాలో వున్నట్లు కేరళాలోని కోజికోఢ్ కు చెందిన అల్ ఇండియా లష్కరేకు చెందిన ఉగ్రవాద సంస్థ లేఖలో పేర్కోన్నట్లు సమాచారం. కాగా, భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సిరీస్ ని వీక్షించేందుకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు.. రోహిత్ శర్మ చేతికి పగ్గాలు అప్పగించారు. దీంతో.. ప్రస్తుతం టీమ్‌కి దూరంగా ఉంటున్న కోహ్లీ భద్రతపైనా అధికారులు దృష్టి సారించారు. అలానే భారత్ జట్టు సీనియర్ ఆటగాళ్ల భద్రతనీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Rohit Sharma  PM Modi  security  arun jaitley stadium  delhi police  Cricket  sports  

Other Articles