domestic violence against Yuvraj droped యువీపై నమోదైన గృహహింస కేసు ఉపసంహరణ

Domestic violence case against yuvraj dropped family relieved

Yuvraj Singh, Yuvraj Singh sister-in-law, Akanksha Sharma, Akanksha Sharma drops domestic violence case against Yuvraj Singh and his family, yuvraj singh domestic violence, yuvraj singh latest news, sports news, sports news, latest sports news, latest news

Yuvraj Singh’s name was dragged for 'malafide' reasons in the domestic violence case against his brother Zoraver but with the matter recently settled after an apology by the accuser.

యువరాజ్ పై నమోదైన గృహహింస కేసు ఉపసంహరణ

Posted: 09/12/2019 06:17 PM IST
Domestic violence case against yuvraj dropped family relieved

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేశంలో కోట్లాది మంది ప్రేమించే యువీ పేరును దురుద్దేశ పూర్వకంగానే కేసులోకి లాగారని పేర్కొన్నారు. ఇప్పుడు అతడు ప్రశాంతంగా ఉండగలడని తెలిపారు. యువరాజ్ సోదరుడు జొరావర్‌ సింగ్‌ సతీమణి ఆకాంక్ష సింగ్‌.

పెళ్లైన ఆర్నెల్లకే వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో భర్త నుండి విడాకులు పోందిన ఆమె.. తన భర్త సహా యువీ, అతడి తల్లి షబ్నమ్‌పై 2017, అక్టోబర్‌లో గృహహింస కేసు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ‘చట్టం నుంచి తప్పించుకోలేనని తెలుసుకున్న ఆకాంక్ష సింగ్‌ తాను చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు అవాస్తవమని అంగీకరించింది.

వాటిని ఉపసంహరించుకుంది. ఈ దేశంలో యువరాజ్‌ సింగ్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అతడి పేరును అడ్డంపెట్టుకొని మా కుటుంబ సభ్యులను లక్ష్యంగా ఎంచుకుంది. గృహహింస కేసుతో యువీ ప్రతిష్ఠకు భంగం కలిగించింది. అన్యాయ ప్రయోజనం (అన్‌ఫెయిర్‌ అడ్వాంటేజ్‌) పొందాలని చూసింది. యువీని చూసి మేం గర్విస్తున్నాం. దేవుడిపై నమ్మకంతో అతడు చట్టం, న్యాయవ్యవస్థపై పోరాడాడు’ అని యువీ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  Akanksha Sharma  Yuvraj singh Famlly  domestic violence  sports  cricket  

Other Articles