England Win Maiden World Cup Title After Super over Drama ప్రపంచ చాంపియన్‌ కల నెరవేరింది.. ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

England win maiden world cup title after super over drama

England, New Zealand, England Vs New Zealand, England Vs New Zealand news, England Vs New Zealand updates, England Vs New Zealand scores, England Vs New Zealand highlights, England Vs New Zealand winner

England Win Maiden World Cup Title After Super over

ప్రపంచ చాంపియన్‌ కల నెరవేరింది.. ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

Posted: 07/15/2019 11:27 AM IST
England win maiden world cup title after super over drama

ఇంగ్లండ్‌ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్లో వన్‌ ఓవర్‌ ఎలిమినేటర్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌. నికోల్స్‌ (55; 77 బంతుల్లో 4×4), లేథమ్‌ (47; 56 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో మొదట న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌; 98 బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను టై చేసింది. 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియగా.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

స్కోరు వివరాలు

 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్‌ 19; నికోల్స్‌ (బి) ప్లంకెట్‌ 55; విలియమ్సన్‌ (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌ 30; టేలర్‌ (ఎల్బీడబ్ల్యూ) వుడ్‌ 15; లాథమ్‌ (సి) సబ్‌ (విన్స్‌) (బి) వోక్స్‌ 47; నీషమ్‌ (సి) రూట్‌ (బి) ప్లంకెట్‌ 19; గ్రాండ్‌హోమ్‌ (సి) సబ్‌ (విన్స్‌) (బి) వోక్స్‌ 16; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 5; హెన్రీ (బి) ఆర్చర్‌ 4; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241

వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240.

బౌలింగ్‌: వోక్స్‌ 9–0–37–3; ఆర్చర్‌ 10–0–42–1; ప్లంకెట్‌ 10–0–42–3; వుడ్‌ 10–1–49–1; రషీద్‌ 8–0–39–0; స్టోక్స్‌ 3–0–20–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్‌ 36; రూట్‌ (సి) లాథమ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 7; మోర్గాన్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) నీషమ్‌ 9, స్టోక్స్‌ (నాటౌట్‌) 84; బట్లర్‌ (సి) సబ్‌ (సౌతీ) (బి) ఫెర్గూసన్‌ 59; వోక్స్‌ (సి) లాథమ్‌ (బి) ఫెర్గూసన్‌ 2; ప్లంకెట్‌ (సి) బౌల్ట్‌ (బి) నీషమ్‌ 10; ఆర్చర్‌ (బి) నీషమ్‌ 0; రషీద్‌ (రనౌట్‌) 0; మార్క్‌ వుడ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 241.

వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241.

బౌలింగ్‌: బౌల్ట్‌ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్‌ 10–2–25–1, ఫెర్గూసన్‌ 10–0–50–3, నీషమ్‌ 7–0–43–3, సాన్‌ట్నర్‌ 3–0–11–0.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles