Game is never over till Dhoni is on crease: Parthiv ధోని క్రీజులో వుండగా నమ్మలేని నిజం: పార్థివ్ పటేల్

Never expected ms dhoni to miss that last ball parthiv patel

ipl 2019, ms dhoni misses last ball, parthiv patel virat kohli, rcb vs csk, kohli dhoni 84, rcb vs csk highlights, dhoni ipl 2019, dhoni rcb vs csk ipl 2019 highlights, dhoni kohli massive scare, dhoni parthiv patel reaction, chennai super kings, royal challengers bangalore, ipl 2019 news, ipl 2019 videoscricket, cricket news, sports news, latest sports news, sports

Parthiv Patel said he was quite surprised that MS Dhoni failed to connect for a big shot on the last ball of the match as RCB defeated CSK by 1 run.

ధోని క్రీజులో వుండగా నమ్మలేని నిజం: పార్థివ్ పటేల్

Posted: 04/22/2019 08:59 PM IST
Never expected ms dhoni to miss that last ball parthiv patel

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో వుండగా, అందులోనూ అటాకింగ్ చేస్తున్న ఆయన చివరి బాల్ ను అంతఈజీగా వదిలేస్తాడని తాము అసలు ఊహించలేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ చివరి బాంతికి పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమికి గురైంది. ఈ గెలుపుపై స్పందించిన సార్థివ్ పటేల్ తాను చూసింది నిజమేనా.. నమ్మలేని నిజమిలా ఎదురైందని వ్యాఖ్యానించాడు.

చివరి ఓవర్.. గెలుపోటలములను నిర్ణయించనున్న చివరి బంతి.. స్టేడియంలో వున్నవారే కాదు.. ఏకంగా టీవీల ముందువున్న వారు కూడా ఒక్కసారిగా తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. తీవ్ర ఉత్కంఠతో కూడిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి రెండు పరుగులు సాధిస్తే బెంగుళూరుపై చెన్నై గెలువడం ఖాయం. క్రీజులో ఉన్నది ధోనీ.. అప్పటికే వీరబాధుడు బాదుతున్న మిస్టర్ కూల్.. మ్యాచ్ పినిష్ చేస్తారని అంతా బావించారు. కానీ కొంత ఉత్కంఠ మాత్రం అందరిలోనూ వుంది. కానీ ధోని చివరి బంతిని వదిలేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోని అంత ఈజీగా వదిలేస్తాడని పార్థివ్ పటేల్ ఊహించలేదట.

మిగిలింది ఒకే ఒక్క బాల్. జట్టు గెలవాలంటే రెండు పరుగులు కావాలి. ఈ పరిస్థితుల్లో ధోనీని ఆఫ్ సైడ్ హిట్ చేసేలా వ్యూహం పన్నాం. ఎందుకంటే లెగ్ సైడ్ కొడితే కచ్చితంగా 2పరుగులు చేసేస్తాడని అందరికీ తెలుసు. ఉమేశ్ యాదవ్‌ని నెమ్మెదిగా వేసి ఆఫ్ సైడ్ కొట్టేలా చేయాలని చెప్పామని పార్థివ్ పటేల్ చెప్పాడు. ఆఫ్ స్టంప్ కు వెలుపలగా వచ్చిన బంతిని ధోనీ అనూహ్యంగా వదిలేశాడు. అది ఎవరూ ఊహించి ఉండరు. ధోనీ ఆ బంతిని వదలడం ఆశ్చర్యానాకి గురి చేసింది. ముందునుంచి మహీకి డాట్ బాల్స్ వేయాలని ప్రయత్నించాం. అతని సంగతి తెలియని వారెవరుంటారు. ఒత్తిడికి గురి చేయాలని అనుకుంటే ఎదురుదాడి చేశాడు' అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన పార్థివ్ పటేల్ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles