క్రికెట్ ప్రేమికులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. 2020లో మహిళలు, పురుషుల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. మంగళవారం సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. పురుషులు, మహిళల జట్లకు ఒకే ఏడాదిలో, ఒకే దేశంలో ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే తొలిసారని ఐసీసీ ప్రకటించింది.
ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్..
మహిళల ప్రపంచకప్ 2020, ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు నిర్వహించనున్నారు. గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు జరుగుతాయి. మార్చి 5న సెమీఫైనల్స్ నిర్వహిస్తుండగా, ఫైనల్ మ్యాచ్ అంతర్జాతీయ మహిళా దినం రోజున అంటే మార్చి 8న మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి.
గ్రూప్-ఏ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, క్వాలిఫయర్-1
గ్రూప్-బి: ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్-2
మెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్..
పురుషుల ప్రపంచకప్ 2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15వరకు జరగనుంది. దీనిలో భాగంగా ఫైనల్ సహా మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌ల తర్వాత అక్టోబరు 24 నుంచి నవంబరు 8 వరకు గ్రూపు మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబరు 11, 12 తేదీల్లో సెమీఫైనల్స్, 15వ తేదీన ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరగనుంది.
గ్రూప్-ఏ: పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్; న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్ జట్లు
గ్రూప్-బి: ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, రెండు క్వాలిఫయర్ జట్లు
మహిళల ప్రపంచకప్ టోర్నీ టిక్కెట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచే అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఐసీసీ తెలిపింది. దీనికోసం t20worldcup.comలోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు టోర్నీల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను స్టార్ స్పోర్ట్ దక్కించుకుంది.
Here's how the teams will be grouped for the @ICC Women's #T20WorldCup 2020 in Australia! What will the key match-ups be? pic.twitter.com/EOt8MC8NP4
— ICC T20 World Cup (@T20WorldCup) January 28, 2019
ICC మెన్స్ వరల్డ్ T20 పూర్తి షెడ్యూల్ ఇలా వుంది..
24 అక్టోబర్ 2020 ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ SCG, సిడ్నీ
24 అక్టోబర్ 2020 ఇండియా vs దక్షిణాఫ్రికా పెర్త్ స్టేడియం
25 అక్టోబర్ 2020 జట్టును నిర్ణయిస్తారు బ్లుండ్స్టోన్ ఎరీనా, హోబర్ట్
25 అక్టోబర్ 2020 న్యూజీలాండ్ vs విండీస్ MCG, మెల్బోర్న్
26 అక్టోబర్ 2020 ఆఫ్గనిస్తాన్ vs నిర్ణయిస్తారు పెర్త్ స్టేడియం, పెర్త్
26 అక్టోబర్ 2020 ఇంగ్లాండ్ vs నిర్ణయిస్తారు పెర్త్ స్టేడియం, పెర్త్
27 అక్టోబర్ 2020 న్యూజీలాండ్ vs నిర్ణయిస్తారు బ్లుండ్స్టోన్ ఎరీనా, హోబర్ట్
28 అక్టోబర్ 2020 ఆఫ్గనిస్తాన్ vs నిర్ణయిస్తారు పెర్త్ స్టేడియం, పెర్త్
28 అక్టోబర్ 2020 ఆస్ట్రేలియా vs విండీస్ పెర్త్ స్టేడియం, పెర్త్
29 అక్టోబర్ 2020 పాకిస్థాన్ vs నిర్ణయిస్తారు SCG, సిడ్నీ
29 అక్టోబర్ 2020 ఇండియా vs నిర్ణయిస్తారు MCG, మెల్బోర్న్
30 అక్టోబర్ 2020 ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా SCG, సిడ్నీ
30 అక్టోబర్ 2020 విండీస్ vs నిర్ణయిస్తారు పెర్త్ స్టేడియం, పెర్త్
31 అక్టోబర్ 2020 పాకిస్థాన్ vs న్యూజీలాండ్ ది గాబ్బా, బ్రిస్బేన్
31 అక్టోబర్ 2020 ఆస్ట్రేలియా మెన్ నిర్ణయిస్తారు ది గాబ్బా, బ్రిస్బేన్
1 నవంబర్ 2020 దక్షిణాఫ్రికా vs ఆఫ్గనిస్తాన్ అడిలైడ్ ఓవల్, అడిలైడ్
1 నవంబర్ 2020 ఇండియా vs ఇంగ్లాండ్ MCG, మెల్బోర్న్
2 నవంబర్ 2020 నిర్ణయిస్తారు vs నిర్ణయిస్తారు SCG, సిడ్నీ
2 నవంబర్ 2020 న్యూజీలాండ్ vs నిర్ణయిస్తారు ది గాబ్బా, బ్రిస్బేన్
3 నవంబర్ 2020 పాకిస్థాన్ vs విండీస్ అడిలైడ్ ఓవల్, అడిలైడ్
3 నవంబర్ 2020 ఆస్ట్రేలియా vs నిర్ణయిస్తారు అడిలైడ్ ఓవల్, అడిలైడ్
4 నవంబర్ 2020 ఇంగ్లాండ్ vs ఆఫ్గనిస్తాన్ ది గాబ్బా, బ్రిస్బేన్
5 నవంబర్ 2020 దక్షిణాఫ్రికా vs నిర్ణయిస్తారు అడిలైడ్ ఓవల్, అడిలైడ్
5 నవంబర్ 2020 ఇండియా vs నిర్ణయిస్తారు అడిలైడ్ ఓవల్, అడిలైడ్
6 నవంబర్ 2020 పాకిస్థాన్ vs నిర్ణయిస్తారు MCG, మెల్బోర్న్
6 నవంబర్ 2020 ఆస్ట్రేలియా vs న్యూజీలాండ్ MCG, మెల్బోర్న్
7 నవంబర్ 2020 ఇంగ్లాండ్ vs నిర్ణయిస్తారు అడిలైడ్ ఓవల్, అడిలైడ్
7 నవంబర్ 2020 విండీస్ vs క్వాలిఫయర్ MCG, మెల్బోర్న్
8 నవంబర్ 2020 దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ SCG, సిడ్నీ
8 నవంబర్ 2020 ఇండియా vs ఆఫ్గనిస్తాన్ SCG, సిడ్నీ
11 నవంబర్ 2020 తొలి సెమీఫైనల్ SCG, సిడ్నీ
12 నవంబర్ 2020 రెండో సెమీఫైనల్ అడిలైడ్ ఓవల్, అడిలైడ్
15 నవంబర్ 2020 ఫైనల్ MCG, మెల్బోర్న్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more