Shami Becomes Fastest Indian To Reach 100 ODI Wickets ఇర్ఫాన్ పఠాన్ రికార్డును బ్రేక్ చేసిన షమి

Mohammed shami becomes fastest indian to reach 100 odi wickets

Mohammed Shami, 100 wickets, md shami fastest 100 wickets, India vs New Zealand, Napier, Virat Kohli, Irfan Pathan, Zaheer Khan, Ajit Agarkar, Javagal Srinath, Shikhar Dhawan, 5000 ODI runs, Kuldeep Yadav, Sun stoppage, sports news, sports, latest sports news, cricket news, cricket

Mohammed Shami became the fastest Indian to claim 100 wickets in One-Day Internationals, reaching the mark in the first match of the ongoing five-match series against New Zealand at Napier.

ఇర్ఫాన్ పఠాన్ రికార్డును బ్రేక్ చేసిన షమి

Posted: 01/23/2019 05:34 PM IST
Mohammed shami becomes fastest indian to reach 100 odi wickets

టీమిండియా పేసర్ మొహమ్మద్ షమి మరో రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు. 50 ఓవర్ల పరిమిత క్రికెట్లో అత్యంత వేగంగా (అతి తక్కువ మ్యాచులు) 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా రికార్డును సృష్టించాడు. ఇది వరకు ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న రికార్డును షమి తన పేరిట తిరగరాసుకున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్‌లో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత పేసర్ షమి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.

రెండో ఓవర్‌లో ఐదో బంతికి కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌‌ను బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించడంతో షమి 100వ వికెట్ సాధించాడు. కేవలం 56 వన్డే మ్యాచ్‌లలో షమి 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇది వరకు ఇర్ఫాన్ పఠాన్ 59 మ్యాచ్‌లలో 100 వికెట్లు సాధించడమే రికార్డుగా ఉండేది.

షమి(56), ఇర్ఫాన్ పఠాన్(59) తర్వాత స్థానాల్లో జహీర్ ఖాన్(65), అజిత్ అగార్కర్(67), జవగల్ శ్రీనాథ్(68) ఉన్నారు. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో షమి కేవలం 19 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. షమి ఆరు ఓవర్లు బౌలింగ్ చేయగా ఇందులో రెండు మెయిడన్ ఓవర్లు కావడం విశేషం. షమి మొత్తం 102 వన్డే వికెట్లు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Shami  100 wickets  India vs New Zealand  Napier  Virat Kohli  Cricket  

Other Articles