Ind Vs WI : Virat Kohli Reaches New Milestone పదివేల పరుగుల మైలురాయిని అధిగమించిన కోహ్లీ

Kohli fastest to 10000 odi runs breaks tendulkar s record

virat kohli, sachin tendulkar, test Cricket, Cricket, West Indies, One-day matches, ODI, fastest run scorer, virat new mile stone, kohli 10,000 runs, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Virat Kohli became the fastest to score 10,000 runs in ODIs, rewriting, fittingly enough, the iconic Sachin Tendulkar's record and compounding the cricket community's conundrum to find the right superlatives for his phenomenal batting.

పదివేల పరుగుల మైలురాయిని అధిగమించిన కోహ్లీ

Posted: 10/24/2018 07:03 PM IST
Kohli fastest to 10000 odi runs breaks tendulkar s record

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 213 వన్డేల్లోనే పది వేల పరుగుల మార్క్ ను కోహ్లీ అధిగమించాడు. కాగా, వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన 5వ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. 10 వేల పరుగుల క్లబ్ లో ఇప్పటికే చోటు సంపాదించిన వారిలో సచిన్ టెండూల్కర్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ ఉన్నారు.

సచిన్ టెండుల్కర్ 266 వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేశాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించడంతో అటు సచిన్ అభిమానులతో పాటు ఇటు విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వేదికగా విండీస్ తో ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ వన్డేలో 106 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 37వ సెంచరీ.   

కోహ్లీ పేరిట ఈరోజు నమోదైన రికార్డులు ఇవే..

1. వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్ మెన్ (సచిన్ రికార్డ్ బ్రేక్)
2. భారత్‌లో వేగంగా 4వేల పరుగులు చేసిన బ్యాట్స్ మెన్
3. వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  sachin tendulkar  ODI Runs  Fastest Run Scorer  West Indies  One-day matches  Cricket  

Other Articles