Team India wrap up Trent Bridge Test ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో టీమిండియా జయకేతనం..

India vs england trent bridge test india win by 203 runs

India vs England, Ind v Eng, Eng v Ind, Trent Bridge, Trent Bridge Test, Virat Kohli, Hardik Pandya, Jasprit Bumrah, Jos Buttler, Ben Stokes, Joe Root, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The victory sets up the series perfectly with India reducing the deficit to 2-1. The legendary Donald Bradman’s Australia are the only team to have come back from two Tests down to win a series and Kohli’s men have begun chasing that dream.

ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో టీమిండియా జయకేతనం..

Posted: 08/22/2018 05:24 PM IST
India vs england trent bridge test india win by 203 runs

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. అద్భుత బ్యాటింగ్‌తో రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులతో కోహ్లీ విజృంభించిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 161 పరుగులకే కుప్పకూలింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 7వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించగా, ఇంగ్లండ్ 317 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో పేసర్ల విజృంభణకు ఇంగ్లండ్‌ తొలి సెషన్లోనే 62 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌, స్టోక్స్‌ అద్భుత ఆటతీరును కనబరుస్తూ సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగించారు. బట్లర్‌ (106) శతకం, స్టోక్స్‌ (62) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

దీంతో నాల్గవ రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ 102 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. చివరి సెషన్లో బుమ్రా కొత్త బంతితో మాయ చేస్తూ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే టెయిలెండర్లు మాత్రం తమ పట్టు వీడకపోవడంతో మ్యాచ్‌ ఫలితం కోసం భారత్‌ ఐదో రోజు వరకు ఆగక తప్పలేదు. ఐదో రోజు క్రీజులోకి వచ్చిన అండర్సన్, రషీద్‌ ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కేవలం మూడు ఓవర్లలోపే వికెట్ కోల్పోయిన మ్యాచ్ ను టీమిండియా చేతిలో పెట్టింది ఇంగ్లాండ్.

ఐదువ రోజు ఆట ప్రారంభమైన తరువాత పట్టుమని పది నిమిషాలు కూడా ఆడలేకపోయిన ఇంగ్లాండ్ టెయిల్ ఎండర్లను భారత్ టెస్టు మ్యాచ్ స్పిన్ దిగ్గజం అశ్విన్‌ పెవిలియన్ కు పంపారు. తన బౌలింగ్లో క్యాచ్‌ ఇవ్వడంతో అండర్సన్ తిరుగుముఖం పట్టాడు. మ్యాచ్ ముగిసే సమయానికి అండర్సన్(11), రషీద్(33) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బూమ్రాకు 5వికెట్లు, ఇషాంత్ శర్మకు 2, అశ్విన్‌కు 1, మహ్మద్ షమీకి 1, హార్థిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. అయిదు టెస్ట్‌ల సీరిస్‌లో ఇంగ్లండ్‌ 2, ఇండియా 1 టెస్ట్ గెలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  Trent Bridge  Third Test  Virat Kohli  Hardik Pandya  Jasprit Bumrah  sports  cricket  

Other Articles