Arjun Tendulkar gets tips from Shastri అర్జున్‌ టెండుల్కర్ పాఠాలు చె్పిన దిగ్గజం..

Arjun tendulkar trains with team india gets tips from shastri

Arjun Tendulkar,virat kohli,sachin tendulkar,Ravi Shastri,National Cricket Academy,india national cricket team,Board of Control for Cricket in India, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The Indian cricketers had their first training session in England on but making heads turn, for obvious reasons, was Sachin Tendulkar's son Arjun, who ran in and bowled fast in the nets organised for Virat Kohli's men.

అర్జున్‌ టెండుల్కర్ పాఠాలు చె్పిన దిగ్గజం..

Posted: 06/26/2018 06:34 PM IST
Arjun tendulkar trains with team india gets tips from shastri

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్రికెట్ పాఠాలు, సలహాలు ఇచ్చారు. అర్జున్‌ టెండూల్కర్‌ శ్రీలంకతో జరగబోయే అండర్‌-19 భారత జట్టులో స్థానం పొందిన విషయం తెలిసిందే. అండర్‌-19 కోసం అర్జున్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో శిక్షణ  పొందుతున్నాడు. ఐర్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు కూడా లండన్‌లో ఉంది. సోమవారం భారత జట్టును కలిసిన అర్జున్ టెండూల్కర్‌ భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి నుంచి విలువైన సలహాలు తీసుకున్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘యువ క్రికెటర్‌ అర్జున్‌ తెందుల్కర్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తోన్న రవిశాస్త్రి’ అని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని టీమిండియా బ్యాట్స్‌మెన్లు అర్జున్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ టీమిండియా ఆటగాళ్లు అర్జున్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేశారు. కోహ్లీ, ధావన్‌కు అర్జున్‌ బౌలింగ్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Tendulkar  virat kohli  Ravi Shastri  practice session  sports  cricket  

Other Articles