టీమిండియా క్రికెటర్, 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మునాఫ్ పటేల్ చుట్టూ మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చు బిగుసుకుంటోంది. రంగంలోకి దిగిన బీసీసీఐ ఈ అరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. రాజ్‌పుటానా ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సందర్భంగా జరిగిన మ్యాచుల్లో జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు ఊతమిస్తుండడంతో బీసీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్పీఎల్ కు కొంత మేరకు ఆర్థిక సాయం అందించిన ఓ వ్యక్తి ‘ఆర్గనైజ్డ్ క్రికెట్ రాకెట్’ వెనక ఉన్నట్టు రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వ్యాపార లావాదేవీలన్నీ భారత్‌కు మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి (మునాఫ్ పటేల్) తోనే ఉన్నట్టు గుర్తించారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మునాఫ్‌ను వివరణ కోరగా ఆ ఆరోపణలు అవాస్తవమని కొట్టి పడేశాడు. ఆర్పీఎల్ వంటి స్థానిక లీగ్‌లను ఫిక్స్ చేయలేమని పేర్కొన్నాడు. తనకు క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదని పేర్కొన్నాడు. తనపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. అది సీఐడీ అయినా, ప్రభుత్వమైనా వదిలిపెట్టబోనని హెచ్చరించాడు. తాను బుకీని కానని, తన బెట్టింగ్‌కు పాల్పడలేదని మునాఫ్ స్పష్టం చేశాడు. ఆర్పీఎల్ లో ఓ మ్యాచ్ లో జరిగిన కొన్ని ఘటనలు ఫిక్సింగ్ ఆరోపణలకు ఊతమిచ్చాయి. ఆ మ్యాచ్‌లో బౌలర్ వరుసపెట్టి వైడ్లు వేశాడు. ప్రత్యర్థి జట్టు విజయానికి పది పరుగులు మాత్రమే అవసరమైన వేళ చివరి ఓవర్ వేసిన బౌలర్ ధారాళంగా వైడ్లు వేస్తూ పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more