Gavaskar slams Chahal after no-ball debacle చాహల్ ప్రోఫెషనల్ క్రికెటర్ కాదా.? లిటిల్ మాస్టర్ ధ్వజం..

India lacked professionalism in defeat to south africa says gavaskar

4th ODI, johenesburg odi, virat kohli, Sunil Gavaskar, Yuzvendra Chahal, no-ball, 5th ODI, Port Elizabeth odi, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, Ajinkya Rahane, MS Dhoni, ODI, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, Port Elizabeth, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Sunil Gavaskar has lambasted India players and Yuzvendra Chahal in particular for bowling a no ball that allowed David Miller to continue batting at the Wanderers in Johannesburg that kept the ODI series alive. India lead the six-match series 3-1.

చాహల్ ప్రోఫెషనల్ క్రికెటర్ కాదా.? లిటిల్ మాస్టర్ ధ్వజం..

Posted: 02/12/2018 07:28 PM IST
India lacked professionalism in defeat to south africa says gavaskar

అతిథ్య దక్షిణాఫ్రికాపై పూర్తి అదిపత్యం చాటి.. వరుసగా మూడు విజయాలను అందుకున్న టీమిండియాకు నాల్గోవ విజయాన్ని అందుకోవడంలో చాహల్‌ వేసిన నో బాల్ దూరం చేసిందని మాజీ క్రికెటర్‌, లిటిల్ మాస్టర్  సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఎదురుదాడికి దిగడంతో భారత స్పిన్నర్లు లయ కోల్పోయారని అరోపించాడు. మరీముఖ్యంగా చాహల్‌ ఎలా పడితే అలా బంతులేశాడని అన్నాడు. మంచి బంతితో మిల్లర్‌ను ఔట్‌ చేసినా.. అది కాస్తా నోబాల్ గా తేలిందని.. దీంతో ఊపిరి పీల్చుకున్న మిల్లర్‌ ఆ తర్వాత చెలరేగి ఆడాడడని ఇదే విరాట్ సేనకు విజయాన్ిన దూరం చేసిందని అన్నాడు.

డివిలియర్స్ ను ముందుగానే పెవిలియన్‌కు పంపడంతో నాలుగో వన్డేలో టీమిండియా గెలుపు ఖాయమనుకున్నామని, అయితే చాహల్‌ నోబాల్‌ విరాట్ సేనను ఓటమి వైపు నడిపించిందని అన్నాడు. ఆ తర్వాత మిల్లర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని, అతనికి తోడు కాస్లెన్‌ కూడా బాగా ఆడాడని అన్నాడు.  మోడ్రన్‌ డే క్రికెట్ లో స్పిన్నర్లు నోబాల్స్‌ వేయడం లేదని.. స్పిన్నర్లు నోబాల్స్‌ వేయడం ఆశ్చర్యం కలిగించే అంశమని అన్నాడు. చాహల్‌ వేసిన బంతి తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని గావస్కర్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles