Jhulan Goswami's double century ఇంగ్లాండ్ నుంచి సఫారీల వరకు అన్ని ప్రత్యేకమే

Jhulan goswami remembers each of her 200 odi wickets

goswami record, virat kohli record, smriti madhana, Jhulan Goswami, India women Cricket, Jhulan Goswami, Jhulan Goswami 200 wickets, women's cricket, Indian women's cricket, south africa, england, cricket

Indian pacer Jhulan Goswami became the first woman cricketer in the world to take 200 wickets in One Day International (ODI) matches on 7 February. Going into the South Africa tour that started on 5 February,

ఇంగ్లాండ్ నుంచి సఫారీల వరకు అన్ని ప్రత్యేకమే

Posted: 02/09/2018 08:09 PM IST
Jhulan goswami remembers each of her 200 odi wickets

తాను తీసిన 200 వికెట్లలో ప్రతి వికెటూ ప్రత్యేకమైనదే అని అంటున్నారు భారత మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఓ వికెట్‌ పడగొట్టడంతో జులన్‌ వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులన్‌ మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వికెట్‌ నాకు గుర్తుంది.

నా తొలి వికెట్‌ 2002లో ఇంగ్లాండ్‌పై సాధించా. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో కారోలిన్ అట్కిన్స్ గాల్లోకి లేపిన బంతిని మిథాలీరాజ్‌ క్యాచ్‌ పట్టింది. ఇప్పటి వరకు నేను సాధించిన ప్రతి వికెట్టూ నాకెంతో ప్రత్యేకమైనది’ అని జులన్‌ తెలిపింది. ‘నేను 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న  మ్యాచ్‌లో విజయం సాధించడం కూడా చాలా సంతోషంగా ఉంది.

నా కుటుంబసభ్యులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధ్యమధ్యలో గాయాల బారిన పడతాం. ఆటలో ఇవన్నీ మామూలే. సిరీస్‌ల మధ్య రెండు మూడు నెలల విరామం ఉండటంతో గాయాల నుంచి కోలుకుని తిరిగి ఫామ్‌ను అందుకోవడం సులువుగా ఉంటుంది’ అని జులన్‌ వివరించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే శనివారం జరగనుంది. ఇప్పటికే 2-0తో భారత్‌ సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jhulan Goswami  200 wickets  south africa  england  women's cricket  Indian women's cricket  cricket  

Other Articles