Kuldeep Yadav Credits MS Dhoni for Success అందంతా ధోని చలవే చైనామెన్ కుల్దీప్

India vs south africa kuldeep yadav credits ms dhoni for success

Chris Morris, India vs South Africa, Kuldeep Yadav, MS Dhoni, South Africa vs India 2018, virat kohli, yuzvendra chahal, sports news, sports news, latest sports news, latest news

Kuldeep Yadav has credited MS Dhoni for his success in his first outing on South African soil, saying the former skipper eased 50 per cent of his workload by giving useful advice from behind the stumps.

అందంతా ధోని చలవే చైనామెన్ కుల్దీప్

Posted: 02/02/2018 08:22 PM IST
India vs south africa kuldeep yadav credits ms dhoni for success

దక్షిణాఫ్రికా తో జరిగిన తొలివన్డే మ్యాచులో టీమిండియా అడిన జట్టులో కీలక పాత్రను పోషించినా.. అదంతా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చలవేనని, అందుచేతే తాను రాణించగలిగానని అన్నాడు చైనామెన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్ ఎంతో పొదుపుగా బౌలింగ్‌ వేశాడు. అత్యంత పోదుపుగా బంతులు విసరడంతో పాటు 10 ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసి సఫారీ జట్టు నడ్డి విరిచాడు. అయితే ధోని వల్లే అనడానికి కారణమేంటీ అంటారా.? అయిత ఇది కుల్దీప్ చెప్పిన మాట.

మ్యాచ్‌ అనంతరం కుల్‌దీప్ మాట్లాడుతూ.. తాను మొదటిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడటంతో తాను ఆందోళనకు గురయ్యానని.. సఫారీలపై ఎలా బౌలింగ్‌ చేయాలన్న విషయమై తనకు ఎలాంటి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పాడు. అయితే ధోనిని ఆశ్రయించి తన పరిస్థితి వివరించగా, ఆయన తనను సాధారణంగానే బౌలింగ్‌ చేయాలని చెప్పారు. అయితే అంతటితో అగకుండా తాను బౌలింగ్ చేస్తున్నంత సేపు వికెట్ల వెనక నుంచి తనకు సలహాలను ఇస్తూనే వున్నాడని దాంతోనే తాను పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు కీలక వికెట్లను తీయగలిగానన్నాడు.

‘ప్రస్తుతం టీమిండియా జట్టులో ఇద్దరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనే ఇద్దరు దిగ్గజాలు ఉన్నారని పేర్కోన్న కుల్దీప్.. ఒకరు ప్రస్తుతం జట్టును నడిపిస్తుండగా, మరొకరు ఇప్పటికే జట్టును విజయవంతంగా నడిపించిన వారని చెప్పాడు. ధోనీ అనుభవం తమకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఆయన బ్యాట్స్ మెన్‌ మైండ్ ను చదివేయగలడని.. అందుకే ధోనీ ఎప్పటికప్పుడు మాకు పరిస్థితిని వివరించి సలహాలు ఇస్తూ ఉంటాడని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  ODI  Proteas  Virat Kohli  Kuldeep Yadav  MS Dhoni  cricket  

Other Articles