Kohli, Smith win top ICC awards రికార్డుల రారాజును వరించిన ఐసీసీ అవార్డులు..

Virat kohli sweeps icc awards 2017 named cricketer of the year

virat kohli, icc cricketer of the year, icc awards, kohli news, icc 2017 years, icc player awards, yuzvendra chahal, india captain, Sports news, latest news, sports, cricket news, cricket

Virat Kohli bagged the honour of being the ICC Cricketer of the year 2017 and also ODI cricketer of the year.

రికార్డుల రారాజును వరించిన ఐసీసీ అవార్డులు..

Posted: 01/18/2018 07:30 PM IST
Virat kohli sweeps icc awards 2017 named cricketer of the year

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 2017లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను ఐసీసీ సర్‌ గార్ ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని అందుకున్నాడు.

టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆడటగాడికి ఐసీసీ ఈ అవార్డు అందజేస్తోంది. దీన్ని కోహ్లి కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. అలాగే ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. కోహ్లీకి ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. 2012లో చేసిన ప్రదర్శనకు గాను కోహ్లీ మొదటిసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2017లో కోహ్లీ 76.84 సగటుతో ఆరు శతకాలు నమోదు చేశాడు. 29 ఏళ్ల వయసులోనే కోహ్లీ వన్డేల్లో 32 శతకాలు సాధించాడు.

సచిన్‌ 49 శతకాల రికార్డును కోహ్లీ ఎప్పుడు బద్దలుకొడతాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని రవిచంద్రన్‌ అశ్విన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బెంగళూరులో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20లో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 25 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు గాను చాహల్‌ అవార్డు అందుకున్నాడు.

ఐసీసీ అవార్డు విజేతల వివరాలు:

* ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)
* ఐసీసీ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్థాన్‌)
* ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌‌ ద ఇయర్‌: హాసన్‌ అలీ(పాకిస్థాన్‌)
* ఫ్యాన్స్‌ మూమెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌- ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌ కైవసం చేసుకోవడం.
* ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- మరాయిస్‌ ఎరాస్‌మస్‌(దక్షిణాఫ్రికా)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  cricketer of the year  icc awards  yuzvendra chahal  cricket  

Other Articles