Kumble attends Virushka's reception ఈ మాజీ వచ్చాడని ఎంతలా స్పందించారో..!

Twitter responded on kumble presence at virushka s reception

Virat Kohli, Anushka Sharma wedding, anil kumble, Anushka Sharma, Team India, virat kohli, virat kohli reception, virat kohli wedding, Virushka, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news, sports, latest sports news, cricket

Former India chief coach Anil Kumble was seen attending the reception of India skipper Virat Kohli and Bollywood superstar Anushka Sharma in Mumbai

ఈ మాజీ వచ్చాడని ఎంతలా స్పందించారో..!

Posted: 12/27/2017 06:35 PM IST
Twitter responded on kumble presence at virushka s reception

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్కల జోడీ ముంబైలో ఇచ్చిన వివాహ విందుకు భారత క్రికెట్‌ మాజీ సారథి, స్పిన్‌ దిగ్గజం, మాజీ ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే హాజరయ్యాడు. దీంతో ట్విటర్ కోడై కూసింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం అప్పటి వరకు టీమిండియాకు కోచ్ గా ఉన్న కుంబ్లే ఆ పదవికి రాజీనామా చేశాడు. ‘నా కోచింగ్‌ శైలి పట్ల కోహ్లీకి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని ఆ తర్వాత కుంబ్లే తెలిపాడు. అంతేకాదు కోహ్లీ-కుంబ్లే మధ్య మనస్పర్థలు, డ్రస్సింగ్ రూంలో కుంబ్లే హెడ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడన్న కారణాలు బయటికివచ్చాయి.

కుంబ్లే పుట్టిన రోజు నాడు కోహ్లీ శుభాకాంక్షలు తెలపకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయిలో ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడ్డారు. తాజాగా ముంబైలో విరుష్క జోడీ ఏర్పాటు చేసిన వివాహ విందు కార్యక్రమానికి కుంబ్లే హాజరయ్యాడు. ఇన్నాళ్లు అభిమానుల మనసుల్లో ఏ మూలో నెలకొన్న సందేహాలు కుంబ్లే హాజరుతో పటాపంచలైపోయాయి. దీంతో నెటిజన్లు ట్విటర్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అవేంటో చూద్దాం.

* బ్రేకింగ్ న్యూస్‌.. బ్రేకింగ్‌ న్యూస్‌.. బ్రేకింగ్‌ న్యూస్‌.. కోహ్లీ రిసెప్షన్‌కు కుంబ్లే హాజరయ్యాడు.

* దిగ్గజ బౌలర్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ముంబైలో విరుష్క జోడీ ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరయ్యాడు.

* కుంబ్లే ఇన్ ద హౌజ్‌..

* ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో కోహ్లీ-కుంబ్లే మధ్య ఏవేవో జరిగాయని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా గానీ అవన్ని పక్కన పెట్టి కుంబ్లేను కోహ్లీ ఆహ్వానించడం సంతోషంగా ఉంది.

* విరుష్క రిసెప్షన్ లో కుంబ్లేను చూడటం ఆనందంగా ఉంది.

* కుంబ్లే వస్తాడని అనుకోలేదు. ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినందుకు సంతోషం.

* విరాట్‌ రిసెప్షన్ కు కుంబ్లే వచ్చాడు. విరాట్‌ ఆటిట్యూడ్ పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన వారు ఇక మానుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka Sharma  Anil Kumble  Mumbai  Reception  cricket  

Other Articles