Rohit first to hit three ODI double centuries సొంత రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

Rohit first to hit three odi double centuries with record score

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, mohali, punjab, Sri Lanka, Team India, Rohit Sharma, double centuries, rohit sharma double centuries, shreyas iyer, shikhar dhawan, MS Dhoni, Hardik Pandya, sports news, sports, latest sports news, cricket news, cricket

Rohit Sharma registered the highest score in One-Day Internationals and also became the first in the history of cricket to hit three double centuries in the 50-overs' format in the second ODI against Sri Lanka.

సొంత రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

Posted: 12/13/2017 04:39 PM IST
Rohit first to hit three odi double centuries with record score

భారత్‌-శ్రీలంక మధ్య పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ఘనతను సాధించాడు. తన పేరునే వున్న సొంత రికార్డును తానే బద్దలు కొట్టుకుని మరో కొత్త రికార్డను సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ దిగ్గజ క్రికెటర్ సాధించని అరుదైన ఫీటును మరోమారు సాధించాడు. వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీని నమోదుచేయడమే గొప్ప. అలాంటి రికార్డును ఇప్పటికే రెండు సార్లు చేసిన ఏకైక క్రికెటర్ గా వున్న రోహిత్ శర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్ లో మరోమారు డబుల్ సెంచరీ సాధించి.. తన రెండు డబుల్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టి.. మూడు డబుల్ సెంచరీలుగా కొత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. శ్రీలంకతో ధర్మశాలలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ నేపథ్యంలో ఎదురైనా పరాభవాన్ని, ఓటమిని గుర్తెపెట్టుకున్న రోహిత్.. తొలుతు నిదానంగా అచితూచి అడుతూ ఆ తరువాత వేగాన్ని పెంచారు. ఎంతలా అంటే శ్రీలంక బౌలర్లు తమ బంతులను రక్షించుకునేందుకు వైడ్ లైన్లను అశ్రయించేంతలా. అయినా రోహిత్, శ్రీయాస్ లు బెట్టువీడలేదు.

సెంచరీని నమోదు చేసుకున్న కెప్టెన్ రోహిత్‌ ఆ తరువాత చెలరేగి ఆడాడు. లక్మల్‌ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా? అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ సాధించి.. తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 151 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో ద్విశతకం (201) సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు.

రోహిత్ సతీమణి రితిక అనందబాష్పాలు..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అడుతున్న వన్డే మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన రోహిత్ శర్మ తన భార్యకు డబుల్ సెంచరీ సాధించిన క్రమంలో ఓ కిస్ ఇచ్చాడు. అదెలా అంటే గాల్లోనే. రోహిత్ శర్మ సరిగ్గా 197 పరుగుల వద్దనున్న క్రమంలో రెండు పరుగులు కోసం యత్నించాడు. అయితే బంతి వేగంగా వికెట్ కీపర్ వద్దకు చేరుతున్న సమయంలో రితిక కొంత అందోళనకు గురైంది. అయితే రోహిత్ జంప్ చేసిన డ్రాడ్ అవుతూ క్రీజులోకి చేరుకున్నాడు. ఆ తరువాత వెనువెంటనే వేసిన మరో బంతికి కూడా రోహిత్ టూ రన్స్ ను తీశాడు.

దీంతో రోహిత్ శర్మ మూడో పర్యాయం తన పేరున డబుల్ సెంచరీలను నమోదు చేసుకుని కొత్త రికార్డుకు తెరలేపాడు. అలా ఈ అరుదైన ఫీటును సాధించగానే గాల్లో ఎగిరి తన బ్యాటును డ్రెసింగ్ రూమ్ వైపు చూపాడు. ఆ తరువాత తన భార్యాకు, తన ఎడమ చేతి ఉంగరం వేలును ముద్దాడి తన భార్యకు గాలి సందేశం పంపాడు. అయితే రోహిత్ ఈ ఫీటు సాధించగానే అతని భార్య రితిక తీవ్ర ఉద్వేగానికి లోనైంది. స్టేడియంలో తనను టీవీ వారు చూస్తున్న విషయం తెలిసినా.. అమె తన ఉద్వేగాన్ని అపుకోలేకపోయింది. తన భర్త సాధించిన రికార్డుతో అమె తన ఆనంద భాష్పాలు రాల్చి బదులిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  mohali  Sri Lanka  Team India  Rohit Sharma  double centuries  cricket  

Other Articles