Stop targetting MS Dhoni, says Kohli ధోనినే మీరు ఎందుకు టార్గెట్.?

Stop targetting ms dhoni says kohli lashing out at his critics

Virat Kohli, MS Dhoni, Virat Kohli backs MS Dhoni, MS Dhoni in T20Is, MS Dhoni retirement, MS Dhoni critics, India vs New Zealand 3rd T20I, IND vs NZ, Virat Kohli press conference video, T20I, retirement, Ind vs NZl, VVS Laxman, Ajit Agarkar, Cricket

MS Dhoni’s form in T20Is against recently concluded series against New Zealand has become a topic of discussion among critics.

ధోనినే మీరు ఎందుకు టార్గెట్.?

Posted: 11/08/2017 07:22 PM IST
Stop targetting ms dhoni says kohli lashing out at his critics

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని టీ ట్వంటీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సునీల్ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోనీకే మద్దతుగా నిలిచారు. టీ20ల నుంచి తప్పుకోవడం ధోనీకి మేలు చేయదని సన్నీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

తాజాగా కెప్టెన్ కోహ్లీ.. ధోనీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్న వారికి దీటుగా సమాధానం ఇచ్చాడు. తిరువనంతపురంలో పర్యాటక జట్టు కివీస్ తో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో భారత్‌ విజయం సాధించి 2-1తో సిరీస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘ధోనీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు. ఒక బ్యాట్స్ మెన్ గా నేను వరుసగా మూడు సార్లు విఫలమైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే నా వయసు ఇంకా 35 సంవత్సరాలు కాదు కాబట్టి. ధోనీ ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నాడు. ఫిట్‌నెస్ పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు.

మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ లో ధోనీ బ్యాట్ తో బాగానే రాణించాడు. ఈ సిరీస్ లో అతనికి ఎక్కువ సమయం మైదానంలో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ధోనీ మాత్రమే కాదు ఈ సిరీస్ లో హార్దిక్‌ పాండ్య కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి అతన్ని ఎందుకు టార్గెట్ చేయరు. ఒక్క ధోనీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు. అలా చేయడం సరికాదు’ అని కోహ్లీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MS Dhoni  T20I  retirement  Ind vs NZl  VVS Laxman  Ajit Agarkar  Cricket  

Other Articles