Vijay back in squad for Sri Lanka Tests శ్రీలంకతో టెస్టుకు విజయ్, ఇషాంత్ లకు స్థానం..

Vijay ishant included in india squad for first two tests against sl

Virat Kohli, Sri Lanka, Murali Vijay, India vs Sri Lanka, india squad for sri lanka series, India squad, Abhinav Mukund, india vs sri lanka, virat kohli, ajinkya rahane, sri lanka tour of india 2017, sports news, cricket

Opening batsman Vijay has returned to India's Test side for the first two Tests against Sri Lanka. Vijay had missed the Tests on the Sri Lanka tour due to a wrist injury.

శ్రీలంకతో టెస్టుకు విజయ్, ఇషాంత్ లకు స్థానం..?

Posted: 10/23/2017 08:25 PM IST
Vijay ishant included in india squad for first two tests against sl

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమయంలో మురళీ విజయ్ కు గాయమైంది. శస్త్రచికిత్స కోసం యూకే వెళ్లిన విజయ్ ఐపీఎల్ తో పాటు ఆ తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత మురళీ విజయ్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడిన ఇషాంత్ శర్మకు జట్టులో చోటు దక్కింది.

జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌, శిఖర్ ధావన్, ఛటేశ్వర పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  virat kohli  ajinkya rahane  sri lanka tour of india 2017  sports  cricket  

Other Articles