Gayle, Samuels return to ODI squad వెస్టిండీస్ క్రికెట్ కు తీపికబరు.. ఇంగ్లాండ్ కు చెమటలు..

Chris gayle returns for england odis sunil narine skips series

chris gayle, Darren Bravo, Dwayne Bravo, England vs West Indies 2017, England vs West Indies ODIs, Sunil Narine, cricket news, cricket, sports news, latest news

Good news for West Indies cricket when Chris Gayle and Marlon Samuels were included in the one-day squad for next month's series against England

వెస్టిండీస్ క్రికెట్ కు తీపికబరు.. ఇంగ్లాండ్ కు చెమటలు..

Posted: 08/22/2017 06:06 PM IST
Chris gayle returns for england odis sunil narine skips series

విండీస్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు విండీస్ క్రికెట్ అభిమానులకు శుభవార్తను అందించింది. అయితే ఈ వార్త కాస్తా ఇంగ్లాండ్ డ్రెస్పింగ్ రూమ్ కు చెమటలు పట్టిస్తుంది. దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల భారత్ తో్ జరిగిన ట్వంటీ 20  మ్యాచులో ఆడిన గేల్.. విండీస్ తరపున వన్డే ఆడి 29 నెలలు అయ్యింది. 2015 మార్చిలో గేల్ చివరిసారి వన్డే జట్టులో కనిపించాడు. ఆ తరువాత ఇంతకాలానికి గేల్ కు వన్డే జట్టులో స్థానం లభించింది.

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా విండీస్ క్రికెట్ బోర్డు మళ్లీ పాత దిగ్గజాలకే ఓటు వేస్తూ.. వారినే ఎంపిక చేసి వారికి ఎంపిక చేసింది. విండీస్ విధ్వంసకర అటగాడిగా పేరొందిన క్రిస్ గేల్ కు ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ లకు ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది. గేల్ తో పాటు మార్లోన్ శామ్యూల్స్ కు విండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. 2016 అక్టోబర్ లో శామ్యూల్స్ చివరగా వన్డే ఆడాడు. వీరిద్దరి ఎంపిక జట్టుకు అదనపు బలాన్ని తీసుకొస్తుందని విండీస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్టనీ బ్రౌన్ అభిప్రాయపడ్డారు.

దాంతోపాటు వీరి అనుభవం యువ క్రికెటర్లకు లాభిస్తుందని బ్రౌన్ పేర్కొన్నారు. అయితే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో కు చోటు కల్పించకపోవడానికి అతను పూర్తి ఫిట్ నెస్ తో లేకపోవడమేనని తెలిపారు. వచ్చే ఏడాది బ్రేవో  పునరాగమనం చేసే అవకాశం ఉందన్నారు. గత కొంతకాలంగా విండీస్ క్రికెటర్లకు బోర్డుకు మధ్య కాంట్రాక్ట్ ఫీజుల విషయంలో తీవ్రస్థాయిలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో్నే కొంతమంది విండీస్ సినియర్ క్రికెటర్లు జట్టుకు దూరమవుతూ వచ్చారు. అయితే ఈ వివాదం కొంతవరకూ పరిష్కారం కావడంతో మళ్లీ వెటరన్ క్రికెటర్ల ఎంపికపై విండీస్ బోర్డు దృష్టి పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England vs West Indies  Chris Gayle  Marlon Samuels  West indies  ODI  cricket  

Other Articles