Dhawan, Pujara take IND to record score గాలే టెస్టు: తొలిరోజు లంక బౌలర్లు కుమ్మెసిస ధావన్, పుజారా..

India vs sri lanka shikhar dhawan cheteshwar pujara take ind to record score

India vs Sri Lanka, Sri Lanka vs India, IND vs SL, SL vs IND, Galle Test, Virat Kohli, Rangana Herath, ajinkya rahane, Hardik Pandya, Shikhar Dhawan, Cheteshwar Pujara, cricket news, sports news, Team India, cricket

Shikhar Dhawan and Cheteshwar Pujara slammed big tons as India were in a commanding position on Day 1 of the first India vs Sri Lanka Test at Galle.India had opted to bat first after Virat Kohli won the toss.

గాలే టెస్టు: తొలిరోజు లంక బౌలర్లు కుమ్మెసిస ధావన్, పుజారా..

Posted: 07/26/2017 08:27 PM IST
India vs sri lanka shikhar dhawan cheteshwar pujara take ind to record score

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీసేన దుమ్మురేపింది. 11 మ్యాచుల తర్వాత టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (190) లంక బౌలర్లపై వీరవిహారం చేశాడు. 31 ఫోర్ల సాయంతో టీ20 తరహాలో విధ్వంసక బ్యాటింగ్ చేసి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. అతనికి ఛతేశ్వర్‌ పుజారా (144) కూడా తోడవ్వడంతో పరుగుల సునామీలా పరుగుల వచ్చాయి. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 399/3తో పటిష్ఠ స్థితిలో నిలిచింది.

టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకొవడంతో ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్ తో కలసి వచ్చిన శిఖర్ ధావన్.. లంక బౌలర్లను కుమ్మెశాడు. అభినవ్ ముకుంద్ 12 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్‌ బౌలింగ్ లో  మాథ్యూస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన పుజారా (144)తో కలిసి ధావన్‌ (190) నిలకడగా ఆడాడు. ఏ మాత్రం తొందర పడకుండా ఆడి లంచ్‌ విరామానికి అర్ధశతకం సాధించాడు. ఇక రెండో సెషన్లో గబ్బర్‌ విజృంభించాడు. లంక బౌలర్లకు చుక్కులు చూపించాడు.
 
పుజారా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేయడంతో శిఖర్ వరుస బౌండరీలతో శతకం చేశాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచి ద్విశతకం దిశగా అడుగేశాడు. 190 పరుగుల వద్ద భారీ షాట్‌ ఆడబోయి 54.1వ బంతికి ప్రదీప్ బౌలింగ్ లోనే మాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్ కు 253 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రెండో సెషన్లో 5.96 రన్ రేట్ తో 167 పరుగులొచ్చాయి. దీంతో ఒక సెషన్లో అత్యధిక పరుగులు (126) చేసిన రెండో భారత బ్యాట్స్ మన్ గా శిఖర్ ధావన్ నిలిచాడు.

ఈ తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఎనమిది బంతులు ఎదర్కోని మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు ప్రదీప్ బౌలింగ్ లోనే వెనుదిగిరాడు. ఆ తర్వాత వచ్చిన వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (39)తో కలిసి పూజారా  ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించి శతకాన్ని నమోదు చేశాడు. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 144తో నిలిచాడు. పుజారాకు తోడుగా రహానె స్ట్రైక్ రొటేట్ చేయడంతో మూడో వికెట్ కు అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 2009లో న్యూజిలాండ్ పై 375/9 తర్వాత విదేశాల్లో భారత జట్టు తొలి రోజు అత్యుత్తమ స్కోరు ఇదే కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  team india  shikhar dhawan  cheteshwar pujara  ajinkya rahane  cricket  

Other Articles