After MS Dhoni, Harsh Goenka Now Takes On Virat Kohli టీమిండియాకు ప్రధాన కోచ్ కావాలి వ్యంగంగా గొయాంక ట్విట్

After slamming dhoni harsh goenka now takes a dig at virat kohli

anil kumble, coach anil kumble, ravi shastri, head coach, chief coach, virat kohli, kohli, virat, anil kumble, kumble, harsh goenka, goenka, virat kohli anil kumble, virat kohli anil kumble rift, kohli kumble, kohli kumble rift, mahendra singh dhoni, dhoni, ms dhoni, msd, ravichandra ashwin, r ashwin, ashwin, rising pune supergiant, rps, indian premier league, ipl, bcci, cricket news, sports news, Team India, cricket

After criticising MS Dhoni during the IPL, industrialist Harsh Goenka has now taken a dig at Virat Kohli in his latest Twitter post.

టీమిండియాకు ప్రధాన కోచ్ కావాలి వ్యంగంగా గొయాంక ట్విట్

Posted: 06/28/2017 07:09 PM IST
After slamming dhoni harsh goenka now takes a dig at virat kohli

టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా వ్యవహారంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శల జడివాన కురుస్తుంది. నిన్నమొన్నటి వరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై విమర్శలు కురిపించిన రైజింగ్ ఫూణే సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయాంక సోదరుడు హర్ష గొయాంక తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఏకంగా బిసిసిఐపై కూడా ఆయన విమర్శించారు.

అయితే ఆయన బిసిసిఐ ఇచ్చిన తరహాలోనే కోచ్ పదవికి ధరఖాస్తులను అహ్వానిస్తూ తనదైన శైలిలో తన ట్విటర్ అకౌంట్ ద్వారా విమర్శించారు. భారత క్రికెట్‌ జట్టుకి కోచ్‌ కావాలి. వారు ఎలా ఉండాలంటే సారథి పట్ల ఎంతో విధేయతతో, బీసీసీఐపై ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి అయి ఉండాలి అని తెలిపారు. ట్విటర్‌ ఖాతాలో కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోమని ఆయన సూచిస్తూ ఏమని పేర్కొన్నారంటే..

‘ఇండియన్‌ క్రికెట్‌ కోచ్‌’ పదవికి దరఖాస్తు చేసుకోండి..

అర్హతలు:
* టీమిండియా పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉత్తమంగా నిర్వహించడం.
* హోటల్‌ గదులు కేటాయించడం.
* బీసీసీఐ, భారత క్రికెట్‌ సారథి పట్ల విధేయతగా ఉండటం.. అని హర్ష సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  virat kohli  ms dhoni  anil kumble  harsh goenka  bcci  cricket  

Other Articles