Ravi Shastri to apply for India’s head coach position టీమిండియా ప్రధాన కోచ్ బరిలో రవిశాస్త్రీ

Ravi shastri to apply for india s head coach position

anil kumble, coach anil kumble, ravi shastri, head coach, chief coach, india cricket coach, bcci, sourav ganguly, sachin tendulkar, vvs laxman, sourav ganguly, tom moody, virat kohli, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Ravi Shastri, has decided to apply for the position of the Indian team's head coach. He also rubbished claims that he would apply only after he is assured of actually getting the job.

టీమిండియా ప్రధాన కోచ్ బరిలో రవిశాస్త్రీ

Posted: 06/28/2017 12:27 PM IST
Ravi shastri to apply for india s head coach position

టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియడం మరో ఏడాదికి పోడిగింపు నేపథ్యంలో తారాస్థాయికి రేగిన వివాదాలతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఆ పదవిపై టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రీ కన్ను వేయడం అంతా చకచకా జరిపోయాయి. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బిసిసిఐపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో రవిశాస్త్రీని ఆ పదవికి దరఖాస్తు చేశారు. గత ఏఢాది టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దూరంగా ఉంటానని గతంలో వ్యాఖ్యానించిన రవిశాస్త్రి.. అందరూ ఊహించినట్లే యూటర్న్‌ తీసుకున్నాడు.

దీంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పంతం నెగ్గించుకున్నారా..? అంటే ప్రస్తుతానికి పరిస్థితులు అలాగే కనబడుతున్నాయి. కుంబ్లే.. రాజీనామా చేయడంతో ప్రధాన కోచ్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన తరుణంలో ఆయన మరోసారి కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల మే నెలలో దరఖాస్తులు కోరగా.. వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, దొడ్డ గణేష్‌, పైబ్స్‌, రాజ్‌పుత్‌ తదితర దిగ్గజాలు అప్లికేషన్లు పంపారు. అయితే వారిలో ఎవరినీ ఎంపిక చేయని బిసిసిఐ.. విరాట్ కోహ్లీ పంతం నేపథ్యంలో మరోమారు ధరఖాస్తులను అహ్వానించగా, రవిశాస్త్రీ ఆ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.

గతంలో రవిశాస్త్రీ ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకున్నా.. అతన్ని ఎంపిక చేయడం కూడా రమారామి ఖాయంగానే కనబడుతుంది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ బిసిసిఐ అడ్వైజరీ కమిటీలోని మాజీ టీమిండియా సభ్యుటు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లపై ఒత్తిడి తీసుకువస్తున్నారని కూడా సమాచారం. గతంలో కనీసం అయనతో ఇంటర్వ్యూ చేసేందుకు కూడా సుముఖంగా లేని గంగూలీ గైర్హాజరయ్యారని కూడా రవిశాస్త్రీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ సారి త్రిసభ్య సలహామండలి నిర్ణయం ఎలా వుండబోతుందన్న అసక్తి సర్వాత్రా నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  ravi shastri  virat kohli  anil kumble  sourav ganguly  bcci  cricket  

Other Articles