Injured Kusal Perera out of Champions Trophy కీలక మ్యాచ్ కు ముందు లంకకు ఎదురుదెబ్బ

Dhananjaya de silva to replace kusal perera for sri lanka

Champions Trophy 2017, Dhananjaya de Silva, ICC Champions Trophy, Kusal Perera, Sri Lanka Cricket Team, sri lanka, pakistan, cricket

Dhananjaya de Silva will replace Kusal Perera in Sri Lanka’s ICC Champions Trophy squad after the latter picked up a hamstring injury against India.

కీలక మ్యాచ్ కు ముందు లంకకు ఎదురుదెబ్బ

Posted: 06/11/2017 04:46 PM IST
Dhananjaya de silva to replace kusal perera for sri lanka

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ కు అడుగుదూరంలో నిలిచిన శ్రీలంక జట్లు రేపు (సోమవారం) పాకిస్థాన్ తో తలపడనున్న నేపథ్యంలో ఎదురుదెబ్బ తగిలింది. లంక వికెట్‌ కీపర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ పెరీరా గాయం కారణంగా టోర్నికి దూరమయ్యాడు. టీమిండియాను ఓడించి జోరుమీదున్న శ్రీలంకకు ఇది ఎదరుదెబ్బే. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పెరీరా తన వ్యక్తిగత స్కోరు 47 పరుగుల వద్ద తొడకండరం పట్టేయడంతో అర్ధంతరంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పెరీరా స్థానంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు నుంచి ఆల్‌రౌండర్‌ ధనంజయ డిసిల్వాకు పిలుపువచ్చింది.

డిసిల్వా శ్రీలంక తరపున 16 వన్డేలు ఆడి 334 పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన రెండో శ్రీలంక ఆటగాడు పెరీరా. ఇంతకుముందు చమర కపుగెదెరా మోకాలి గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో దనుష్క గుణతిలకను తీసుకున్నారు. ఇక పాకిస్థాన్ జట్టులో కూడా వహబ్ రియాజ్ కూడా గాయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్ కు బర్త్ కన్ఫామ్ చేసుకుంటుండంతో రెండు జట్లకు ఇది కీలకంగా మారనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy 2017  Kusal Perera  dhananjaya de silva  sri lanka  pakistan  cricket  

Other Articles