Confident of Winning the Final, Says Karn Sharma ఈ సారి ఐపీఎల్ చాంఫియన్స్ మేమే: కరణ్ శర్మ

Confident of winning the final says karn sharma

IPL 2017, IPL final, karn sharma, kolkata knight riders, Mumbai Indians, piyush chawla, MS dhoni, steve smith, rising pune super gaints, sports, cricket

Mumbai Indians' Karn Sharma is confident of winning the Indian Premier League final against Rising Pune Supergiant even though they have lost all three matches against them so far.

ఈ సారి ఐపీఎల్ చాంఫియన్స్ మేమే: కరణ్ శర్మ

Posted: 05/20/2017 05:44 PM IST
Confident of winning the final says karn sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సారి తాము సత్తా చాటి టైటిల్ ను చేజిక్కించుకుంటామని ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరగనున్న తుది పోరులో కచ్చితంగా తమ జట్టు విజయం సాధించి టైటిల్ ను సాధిస్తామని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్ లో నాలుగు వికెట్ల సాధించి కోల్ కతా పతనాన్ని శాసించిన కరణ్ శర్మ.. రైజింగ్ పుణెపై కూడా తమదే పైచేయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

తాము ఫైనల్ మ్యాచ్ ను గెలవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామని చెప్పాడు. కచ్చితంగా టైటిల్ ను చేజిక్కించుకుంటామని తెలిపాడు. పుణెపై ఓటముల రికార్డు అనేది గతమని.. తుది సమరంలో తమ ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలుస్తుందని చేశాడు. కొల్ కత్తా నైట్ రైడర్స్ తో మ్యాచ్ అయిన తరువాత ఆయన ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని ముగించుకుని మీడియాతో మాట్లాడాడు.

అయితే ఫైనల్ మ్యాచ్ లో తుది జట్టులో స్థానంపై హర్భజన్ సింగ్ తో పోటీ ఉందా అనే విషయంలో కరణ్ శర్మ సమాధానం దాటేశాడు. అది తన చేతుల్లో ఉండదని, జట్టు సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుందన్నాడు. కేవలం  అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే తనకు ముఖ్యమన్నాడు. 'బౌలింగ్ చేయడమే నాకు తెలిసింది. మ్యాచ్ గెలవడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తా. నేను జట్టులో లేకపోయినప్పటికీ ఎక్కువ శ్రమిస్తునే ఉంటా'అని కరణ్ శర్మ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karn Sharma  Mumbai indians  rising pune  IPL-10  cricket  

Other Articles