దిగివచ్చిన బ్రాడ్ హాడ్జ్.. కోహ్లీకి క్షమాపణలు Brad Hodge Apologized On Twitter For Nasty Comments

Brad hodge apologized on twitter for nasty comments on kohli

india vs australia, ind vs aus, aus vs ind, australia vs india, dharmasala test, Brad Hodge, virat kohli, Indian premier league, former australian cricket, apology, twitter, gujarat lions coach, Brad Hodge slammed, cricket, cricket news, sports news, sports

Brad Hodge got slammed on social media mercilessly after his unpleasant comment and now it seems as if he has realized his mistake and therefore, he has issued an apology for it on Twitter

దిగివచ్చిన బ్రాడ్ హాడ్జ్.. కోహ్లీకి క్షమాపణలు

Posted: 03/30/2017 05:53 PM IST
Brad hodge apologized on twitter for nasty comments on kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై నోరుపారేసుకున్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ గుజరాత్ లయన్స్ కోచ్ బ్రాడ్ హాడ్జ్ తీవ్ర విమర్శల పాలు కావడంతో.. ఎట్టకేలకు దిగివచ్చాడు. కోహ్లీపై తప్పిదారి నోరు జారానని అందుకు తనను అయన అభిమానులతో భారత దేశ క్రికెట్ ప్రేమికులు, దేశ పౌరులు క్షమించాలని అర్థించాడు. ఇండియన్ ప్రీమిమర్ లీగ్ పదో సీజన్ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ అత్యంత కీలకమైన టీమిండియా-అసీస్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన నాల్గో టెస్టులో అడలేదని అరోపించిన విషయం తెలిసిందే.

ట్వట్టర్ అనుసంధానంగా అరోపణలు చేసిన బ్రాడ్ హాడ్జ్.. అదే ట్విట్టర్ ద్వారా కోహ్లీకి క్షమాఫణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు విరాట్ ను కించపరచడానికి కాదని తాజాగా స్పష్టం చేశాడు. అయితే భారత్ అసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అత్యంత కీలకమైన ధర్మశాల నుంచి విరాట్ వైదొలగడాన్ని తాను అలానే అర్ధం చేసుకున్నట్లు హాడ్జ్ తెలిపాడు. అయితే గాయం తీవ్రత అధికంగా లేదని కోహ్లీ పేర్కోన్న నేపథ్యంలో తాను అలా అనుకున్నానని చెప్పుకోచ్చాడు. అయితే తన వ్యాఖ్యలు ఎవరినైనా గాయపరిస్తే క్షమించాలని కోరాడు.

తన ఉద్దేశ్యం ఎవరినీ గాయపరచాలని కాదని.. ఖరీదైన టోర్నీకి అందరూ క్రీడాకారులు ముందునుంచే సిద్దమవుతున్నారని, పలువురు అటగాల్లు దేశం తరపున అడాల్సిన అటలను కూడా వదులు కుంటున్నారని, ఈ నేపథ్యంలో కోహ్లీ విషయంలోనూ తాను తప్పుబట్టానన్నారు. అంతేకాని విరాట్ ను కించపర్చాలని కాదన్నాడు. అయితే గాయం కారణంగా పిట్ నెస్ లేకపోవడంతో కోహ్లీ మ్యాచ్ కు దూరమైయ్యాడని తనకు తెలియదన్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian premier league  India  Australia  virat kohli  brad hodge  IPL-10  cricket  

Other Articles